iPhone 16 Pro
iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 ప్రో కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రో ధర రూ. 16వేల కన్నా తగ్గింది. ప్లాట్ డిస్కౌంట్, అదనపు బ్యాంక్ ఆఫర్లతో లిమిటెడ్ ఆఫర్ అందిస్తోంది. కొత్త ఐఫోన్ కొనేవారు ఐఫోన్ 16 ప్రో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) హుడ్ కింద పవర్‌ఫుల్ A18 ప్రో చిప్‌పై రన్ అవుతుంది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ కోసం 120Hz ప్రోమోషన్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రో ట్రిపుల్-లెన్స్ సెటప్‌ను అందిస్తుంది.
ఇందులో 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP పెరిస్కోప్ టెలిఫోటో ఉన్నాయి. కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా కలిగి ఉంది. ఫొటోలు, వీడియోలకు అద్భుతంగా ఉంటుంది.
ఐఫోన్ 16 ప్రో కొనాలా వద్దా? :
అతి తక్కువ ధరకే ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16ప్రో చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 16 ప్రో భారీ తగ్గింపుతో పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్రో డిస్కౌంట్ :
ఐఫోన్ 16 ప్రో 256GB స్టోరేజ్ ధర రూ.1,29,900కు అందిస్తోంది. విజయ్ సేల్స్‌లో ఇప్పుడు ఐఫోన్ 16ప్రో ధర రూ.1,16,490కి లిస్టు అయింది. అసలు ధర కన్నా ఫ్లాట్ రూ.13,410 డిస్కౌంట్ అందిస్తోంది.
Read Also : Nothing Phone 2 : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ డోంట్ మిస్..!
ICICI, Axis, Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఐఫోన్ 16 ప్రో రూ.16,410 తగ్గింపుతో ధర కేవలం రూ.1,13,490కి లభ్యమవుతుంది.