iPhone యూజర్లకు అలర్ట్ : నవంబర్ 3లోపు iOS Update చేసుకోండి

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తమ బ్రాండ్ ఐఫోన్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. ఐఫోన్ 5 మోడల్ వాడే యూజర్లను వెంటనే అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తమ డివైజ్ లోని iOS వెర్షన్ ను iOS 10.3.4కు అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. నవంబర్ 3లోగా ఐఫోన్ 5 యూజర్లు అందరూ కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలి.
లేదంటే.. ఐక్లౌడ్, యాప్ స్టోర్ కు సంబంధించిన ఫంక్షన్స్ ఆయా డివైజ్ లపై పనిచేయవు. ఇదివరకే ఆపిల్ కంపెనీ ఐఫోన్ 5 యూజర్లకు వరుసగా అలర్ట్ పంపుతోంది. ఆప్ స్టోర్, ఐక్లౌడ్, ఈమెయిల్, వెబ్ సహా ఇతర సర్వీసులను వినియోగించుకోవాలంటే తప్పనిరిసరిగా ఐఓఎస్ 10.3.4 వెర్షన్ అప్ డేట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
‘స్థానిక కాలమానం ప్రకారం.. నవంబర్ 3, 2019 12:00AM సమయానికి ముందుగానే ఐఫోన్ 5 డివైజ్ ల్లో iOS అప్ డేట్ అయి ఉండాలి. డివైజ్ ఫంక్షన్స్ కొనసాగించేందుకు వీలుగా GPS లొకేషన్, డేట్, టైమ్, ఆపిల్ స్టోర్, ఐక్లౌడ్, ఈమెయిల్, వెబ్ బ్రౌజింగ్ అన్ని సెట్ చేసి ఉండాలి’అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. GPS టైమ్ రోల్ ఓవర్ ఇష్యూ కారణంగా ఇతర డివైజ్ నుంచి GPS ఎనేబుల్ ప్రొడక్టులపై ఏప్రిల్ 6న ప్రభావం ప్రారంభమైంది.
ఈ ఇష్యూ తలెత్తిన ఆపిల్ డివైజ్ లు నవంబర్ 3, 2019 (12AM) మందు వరకు ఎలాంటి ప్రభావం ఉండదు అని కంపెనీ పేర్కొంది. ప్రభావితమైన ఆపిల్ డివైజ్ ల్లో ఐఫోన్ 5, నాల్గో జనరేషన్ ఐప్యాడ్, వై-ఫై, సెల్యూలర్ అన్ని iOS 10.3.4కు అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు iPhone 4s, తొలి జనరేషన్ ఐప్యాడ్ మినీ Wi-Fi, సెల్యూలర్, iPad 2తో Wi-Fi, CDMA సెల్యూలర్, మూడో జనరేషన్ iPadతో Wi-Fi, సెల్యూలర్ తప్పనిసరిగా iOS 9.3.6 వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంది.