iQOO 12 5G Price : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అమెజాన్‌లో ఈ ఐక్యూ 12 5Gపై భారీ డిస్కౌంట్.. ఇంకా తగ్గాలంటే?

iQOO 12 5G Price : అమెజాన్‌లో ఐక్యూ 12 5G ఫోన్ ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ. 12వేలు తగ్గింది. బ్యాంకు ఆఫర్లతో ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

iQOO 12 5G Price

iQOO 12 5G Price : కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో ఐక్యూ 12 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. మల్టీ టాస్కింగ్ లేదా గేమింగ్ కోసం హై పర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఆఫర్. ప్రస్తుతం అమెజాన్‌లో పాత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఐక్యూ 12 5G ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

బ్యాంక్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు పొందవచ్చ. ఈ ఆఫర్లతో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.12వేల వరకు ఆదా చేసుకోవచ్చు. రూ.52,999 ధర గల ఈ ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, అమోల్డ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటివి ఉన్నాయి. మీరు ఐక్యూ 12 5G ఫోన్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో ఐక్యూ 12 5G ధర :
ప్రస్తుతం ఐక్యూ 12 5G ఫోన్ ధర తగ్గింది. అసలు ధర రూ.52,999 నుంచి రూ.41,999కి తగ్గింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కస్టమర్లు అదనంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. దాంతో ఈ ఐక్యూ ఫోన్ ధర రూ.41వేల కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. కొనుగోలుదారులు నెలకు రూ.2,036 EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

అలాగే, కొన్ని నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్లతో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.22,800 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. యాడ్-ఆన్‌ల ప్రకారం.. కస్టమర్లు మొబైల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, అదనపు మొబైల్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా పొందవచ్చు.

ఐక్యూ 12 5G స్పెసిఫికేషన్లు :
ఐక్యూ 12 ఫోన్ 6.78-అంగుళాల (LTPO) అమోల్డ్ డిస్‌ప్లేను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,000 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. HDR10+కి సపోర్టు ఇస్తుంది. డైనమిక్ రేంజ్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, అడ్రినో 750 GPU, ఐక్యూ Q1 గేమింగ్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు (LPDDR5X) ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ ఫోన్ (FunTouchOS 14)తో ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఐదు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకుంటుంది. బ్యాటరీ 5,000mAh సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఛార్జింగ్ ఆప్షన్లతో 120W వైర్డు, 50W వైర్‌లెస్, 10W రివర్స్ వైర్‌లెస్ ఉన్నాయి.

కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64MP టెలిఫోటో ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో వెట్ టచ్ అల్గోరిథం కూడా ఉంది. తడి చేతులతో టచ్ చేసినా అద్భుతంగా రెస్పాండ్ అవుతుంది.