IRCTC Jyotirlinga Tour : టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC యాత్ర కొత్త ప్యాకేజీలివే.. కేవలం రూ.14 వేలకే 5 జ్యోతిర్లింగాల దర్శనం..!

IRCTC Jyotirlinga Tour : జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్లేవారి కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC Jyotirlinga Tour

IRCTC Jyotirlinga Tour : జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? యాత్రికుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే ఆగస్టు 16వ తేదీన ఈ యాత్ర మొదలవుతుంది.

5 జ్యోతిర్లింగాల దర్శనం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కు సంబంధించి ప్రదేశాలను వీక్షించేందుకు ఐఆర్‌సీటీసీ ఈ యాత్రను ప్రకటించింది. ఇందులో భాగంగా ‘అంబేడ్కర్‌ యాత్ర విత్‌ పంచ జ్యోతిర్లింగ దర్శన్‌’ పేరిట టూర్ ప్యాకేజీ అందిస్తోంది. భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైల్లో వెళ్లేవారికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది.

షెడ్యూల్ ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఆగస్టు 16న యాత్ర మొదలువుతుంది. అనంతరం ఆగస్టు 24న మొత్తం 9 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల్లో పూర్తి అవుతుంది.

ముందుగా ఉజ్జయినిలో మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్‌ జ్యోతిర్లింగం, దీక్షా భూమి స్థూపం, నాగ్‌పుర్‌లో స్వామినారాయణ మందిరం, జన్మభూమి అంబేడ్కర్‌ జన్మస్థలం, నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగం, పుణెలో భీమశంకర్‌ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. సికింద్రాబాద్‌ నుంచి కామారెడ్డి, నిజామాబాద్‌ స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ తీసుకున్న యాత్రికులందరికి వసతి, భోజనం వంటి అన్నిరకాల సౌకర్యాలు ఉంటాయి.

జ్యోతిర్లింగాల సందర్శనం ఇలా :
వచ్చే ఆగస్టు 16వ తేదీన సికింద్రాబాద్‌ నుంచి మధ్యహ్నం 2 గంటలకు యాత్ర రైలు బయల్దేరుతుంది. ఆరోజు సాయంత్రం 4:30 గంటలకు కామారెడ్డి, 5:40 గంటలకు నిజామాబాద్‌లో యాత్రికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. మొదటి రోజున ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది. 2వ రోజు ఉదయం 8 గంటలకు నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌ చేరుకున్నాక IRCTC సిబ్బంది యాత్రికులను దీక్ష భూమి స్థూపం వద్దకు పంపిస్తారు.

Read Also : Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోందోచ్.. భారత్ లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా, స్పెసిఫికేషన్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

సమయం ఆధారంగా శ్రీ స్వామినారాయణ మందిర్‌కు కూడా తీసుకెళ్తారు. ఉజ్జయినికి వెళ్లాలంటే మళ్లీ నాగ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లోనే దిగాలి. 3వ రోజు ఉజ్జయినిలో మహాకాళేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లొచ్చు. బుక్ చేసిన హోటల్‌లో ఆ రాత్రి బస చేయొచ్చు. నాల్గో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జన్మభూమి చూసేందుకు వెళ్లొచ్చు.

మధ్యాహ్నం మీల్స్ అయ్యాక ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవచ్చు. ఆపై నాసిక్‌ వెళ్లేందుకు అంబేడ్కర్‌ నగర్‌ రైల్వే స్టేషన్‌లో దిగాలి. 5వ రోజు నాసిక్‌ రైల్వే స్టేషన్‌ వద్దకు వస్తారు. ఆ రాత్రి అక్కడి హోటల్‌లోనే బస చేయొచ్చు. 6వ రోజున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసి త్రయంబకేశ్వర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లొచ్చు. పుణె వెళ్లేందుకు నాసిక్‌ రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సి ఉంటుంది. 7వ రోజు పుణెలో ఖడ్కి రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకుని అనంతరం హోటల్‌కు వెళ్లొచ్చు.

ఆ తర్వాత భీమశంకర్‌ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లొచ్చు. ఔరంగబాద్ వెళ్లాలంటే ఖడ్కి రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకోవాలి. 8వ రోజు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌, ఏదైనా హోటల్లో దిగి ఆ తర్వాత ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవచ్చు. సికింద్రాబాద్‌ వెళ్లే రైలు ఔరంగబాద్ రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకుంటుంది. 9వ రోజు అర్ధరాత్రి 12:20 గంటలకు నిజామాబాద్, 1:32 గంటలకు కామారెడ్డి, ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

టూర్ ప్యాకేజీ ఛార్జీల వివరాలివే.. :
కంఫర్ట్‌ 2AC : ప్రతి ప్యాసెంజర్‌కు రూ.29, 900, 5ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు రూ.28,400
స్టాండర్డ్‌ 3AC : ప్రతి ప్యాసెంజర్ రూ.22,900, పిల్లలకు రూ.21,700.
ఎకానమీ స్లీపర్‌ క్లాస్ : ప్రతి ప్యాసెంజర్ రూ.14700, చిన్నారులకు టికెట్‌ ధర రూ. 13,700

టూర్ ప్యాకేజీ ఆధారంగా 3AC, 2AC, స్లీపర్ క్లాస్‌‌లో వెళొచ్చు. యాత్రలో బస కోసం రూమ్స్, ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీగా తినొచ్చు. జ్యోగిర్లింగ దర్శన యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివి ప్యాకేజీలోనే ఉంటాయి. ఈ టూర్‌ ప్యాకేజీ వివరాలు, బుకింగ్‌ వంటివి IRCTC వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. బుకింగ్‌ కోసం 9701360701, 9281030712, 9281030711 నంబర్లను వెంటనే సంప్రదించి తమ ఫిర్యాదులను తెలియజేయొచ్చు.