Nirmala sitharaman
Economic Survey: దేశంలో ఉచిత పథకాలకు సంబంధించి కేంద్ర ఎకనామిక్ సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఎకనామిక్ సర్వేలో ఉచిత పథకాలు, ఎలాంటి టార్గెట్లు లేకుండా క్యాష్ ట్రాన్స్ ఫర్లు చేయడం లాంటి పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఇలాంటి పథకాల కంటే కూడా బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్ లో ఉన్న పథకాలను అమలు చేస్తే బెటర్ అని అభిప్రాయపడింది.
దేశంలో ఈ మధ్య కాలంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి పొలిటికల్ పార్టీలు ఇబ్బడిముబ్బడిగా వరాలు ప్రకటిస్తున్నాయి. ఆడవారికి 10వేలు ఇస్తాం. రైతులకు ఇవి ఇస్తాం.. చేనేతలకు అది ఇస్తాం.. పిల్లలకు ఇంకోటి ఇస్తాం.. నిరుద్యోగులకు ఫలానాది ఇస్తాం. ఇలా నోటికి వచ్చినట్టు హామీలు గుప్పిస్తున్నాయి. ఏ రాష్ట్రం కూడా వీటికి అతీతం కాదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, అసోం, పశ్చిమ బెంగాల్.. ఇలా ఒకటేంటి ప్రతి రాష్ట్రం కూడా ఇలాంటి ఉచిత హామీల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాయి.
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. 5 టీమ్‌లతో దుండగుల కోసం పోలీసుల గాలింపు.. డీసీపీ ఏం చెప్పారంటే?
దేశంలో ఉచిత హామీలు, మనీ ట్రాన్స్ ఫర్లు ఏ రేంజ్ లో పెరిగిందంటే 2023 నుంచి 2026 నాటికి అది ఐదింతలు పెరిగింది. ప్రస్తుతం దేశ ఆర్థిక బడ్జెట్ మీద 1.7 లక్షల కోట్లు ఈ ఉచితాలు, మనీ ట్రాన్స్ ఫర్ల రూపంలో ప్రజలకు అందుతున్నాయి. ఏడు రాష్ట్రాల్లో నెలవారీ వచ్చే ఆదాయంలో 87 శాతం కేవలం ఈ ఉచితాలకు ఇవ్వడానికే సరిపోతుందంటే పరిస్థితి ఏం స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉచితాల వల్ల లాభం జరిగిందా?
ఆర్థిక సర్వేతో పాటు ఇతర ప్రభుత్వ సర్వేలు, అంచనాలను గమనిస్తే ఈ ఉచిత పథకాలు, డబ్బులు ట్రాన్స్ ఫర్ల వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ స్థాయిలో పురోగతి కూడా సాధించలేదు. మహిళలకు గానీ, ఇతరులకు గానీ ఇస్తున్న ఉచిత హామీల డబ్బుల వల్ల పెద్దగా వారి జీవితాలో మార్పులు తీసుకురాలేకపోయాయని సర్వేలు చెబుతున్నాయి. వాళ్లకు డబ్బులిస్తే ఏదో మంచి జరిగి వాళ్ల జీవితాలు మారతాయని ఆశించిన ఫలితం దక్కలేదు. మరోవైపు రాష్ట్రాల ఖజానాల మీద ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది. దీని వల్ల ఆర్థిక లోటు పెరుగుతోంది.
టార్గెట్ ఓరియంటెడ్ గా ఉండాలా?
జనాల చేతిలో డబ్బుల పెడుతున్నప్పుడు, ఉచితాల రూపంలో కాకుండా ఏదో ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఉండాలని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు స్కూలుకి వస్తేనే డబ్బులిస్తామని అంటే వాళ్లు స్కూలుకు వచ్చినప్పుడు వాళ్ల అటెండెన్స్ పూర్తిగా, ప్రాపర్ గా చెక్ చేసి వాళ్ల అకౌంట్లో డబ్బులు వేయడం. ఇది ఓ రకంగా బెటర్. ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు. మెల్లగా వృద్ధిలోకి వస్తారు.
ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, గర్భిణులు ప్రాపర్ గా చెకప్స్ చేయించుకోవడం, పిల్లలకు కచ్చితంగా వ్యాక్సిన్లు వేయించడం.. ఇలాంటి వాటికి మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే ఆరోగ్య పరంగా దేశం బాగుపడుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే సగం సమస్యలు లేనట్టే. ఎందుకంటే ఇండియా లాంటి దేశంలో ఒక్క చిన్న జబ్బు వచ్చినా ఆస్పత్రుల్లో ఖర్చుల సంగతి తెలిసిందే. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక్కసారి ఆస్పత్రి పాలవుతుంది. కాబట్టి హెల్త్ లాంటి అంశాలపై ఉచితాలు, మనీ ట్రాన్స్ ఫర్లు చేస్తే బెటర్ అనే అభిప్రాయం ఎకనామిక్ సర్వే వెలిబుచ్చింది.
బ్రెజిల్‌ను ఉదాహరణగా తీసుకోవాన్న సర్వే
ఉచితాలు, కండిషనల్ మనీ ట్రాన్స్ ఫర్ల లాంటి అంశాల్లో ఎలా పడితే అలా ఇచ్చేయకుండా బ్రెజిల్ ను ఫాలో అయితే బెటర్ అనే అభిప్రాయాన్ని ఎకనామిక్ సర్వే అభిప్రాయపడింది. బ్రెజిల్లో 2003లో బోల్సా ఫెమీలియా అనే స్కీమ్ తెచ్చారు. అక్కడ విద్య, వైద్యం (పైన చెప్పిన ఎగ్జాంపుల్స్) అంశాల్లో లబ్దిదారులకు బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.
ఇది సత్ఫలితాలు ఇచ్చింది. ఈ రకంగా చేయడం వల్ల ఒకదశకు వచ్చాక ఆ విద్యార్థి చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యాక డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. అలాగే, స్త్రీలకు కూడా ఆ టార్గెట్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా ‘ఫలానా కులం వారికి డబ్బులు ఇస్తాం.’ అని ఎన్నికల హామీలు ఇస్తే వాళ్లకు జీవితాంతం ఇస్తూ పోవాలి.
అలాగే, మెక్సికో, ఫిలిప్పీన్స్ లో కూడా ఇలాంటి కండిషన్ల మీదే మనీ ట్రాన్స్ ఫర్ పథకాలు ఉన్నాయి. దీని వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది. అలాగే, సరైన దిశలోనే ప్రజల సొమ్ము ఖర్చవుతుంది. మొత్తానికి ఉచితాలు, డబ్బుల పంపిణీలు అనేవి కొన్ని కండిషన్ల ద్వారా జరగాలని ఎకనామిక్ సర్వే కచ్చితంగా అభిప్రాయపడింది. అలాగే, టైమ్ కండిషన్లు కూడా పెట్టుకోవాలని సూచించింది. లేకపోతే ఆర్థికంగా దెబ్బతింటామని స్పష్టం చేసింది.