ITR Refund : మీ ఐటీఆర్ ఫైలింగ్ చేశారా? ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఐటీఆర్ గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. డ్యూ డేట్ వరకు ఐటీఆర్‌ను దాఖలు చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగే వడ్డీ కూడా చెల్లించాలి. డిసెంబర్ 31, 2025 వరకు దానిని దాఖలు చేయవచ్చు.
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. జూలై 1 వరకు 75,18,450 కన్నా ఎక్కువ ఐటీఆర్ రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. 71,11,836 రిటర్న్‌లు కూడా వెరిఫై అయ్యాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు తర్వాత పన్ను చెల్లింపుదారులు రీఫండ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రీఫండ్ డబ్బు ఎన్ని రోజుల్లో ఖాతాలోకి వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎన్ని రోజుల్లో రీఫండ్ వస్తుంది? :
ఆదాయపు పన్ను శాఖ ఆటోమేషన్, అప్‌గ్రేడ్స్ తర్వాత ఆదాయపు పన్ను రీఫండ్ ఇప్పుడు 10 రోజుల్లో జారీ అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, రీఫండ్ పొందే కాలపరిమితి కూడా కొన్నిసార్లు మారవచ్చు. ఒక్కోసారి ఐటీఆర్ రీఫండ్ కొన్ని రోజుల్లోనే ప్రాసెస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో వారాల సమయం పడుతుంది.