Banking Rules : ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఈ 4 ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అక్కర్లేదు.. మీ బ్యాంకు ఉందేమో చెక్ చేసుకోండి..!
Banking Rules : మీ బ్యాంకు అకౌంటులో కనీస బ్యాలెన్స్ లేదా? ప్రభుత్వ బ్యాంకుల సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌పై విధించే ఛార్జీని ఎత్తేశాయి.

Banking Rules
Banking Rules : మీకు బ్యాంకు అకౌంట్ ఉందా? ఇకపై ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. సాధారణంగా ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే తప్పనిసరిగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే.. ఆయా సేవింగ్స్ అకౌంట్లపై ఛార్జీలు విధిస్తాయి. సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) అనేది కస్టమర్ బ్యాంకు అకౌంటులో కనీస బ్యాలెన్స్.
అయితే, సేవింగ్స్ అకౌంట్ టైప్ బట్టి జరిమానా మారుతుంది. కానీ, ఇప్పుడు దేశంలోని అనేక ప్రధాన బ్యాంకుల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తద్వారా సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు భారీ ఉపశమనం కలిగించాయి. కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని కస్టమర్లకు భారీ ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఏయే బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ విధానాన్ని రద్దు చేశాయో వివరంగా తెలుసుకుందాం..
ఇండియన్ బ్యాంక్ :
జూలై 7, 2025 నుంచి అన్ని సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది. కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా చిన్న లావాదేవీల కోసం ఖాతాలను ఉపయోగించే కస్టమర్లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
2020లో ఎస్బీఐ (SBI) అన్ని సేవింగ్స్ అకౌంట్ల నుంచి కనీస బ్యాలెన్స్ నిబంధనను తొలగించింది. ఈ విధానం ప్రకారం.. ఖాతాదారులు ఇకపై బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎలాంటి పెనాల్టీ పడదు. ఎస్బీఐలో లక్షలాది మంది ఖాతాదారులకు ఉపశమనం కలిగించింది.
కెనరా బ్యాంకు :
మే 2025లో కెనరా బ్యాంక్ అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లలో జనరల్ సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, NRI సేవింగ్స్ అకౌంట్లు, సగటు నెలవారీ బ్యాలెన్స్ నిబంధన తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు కనీస బ్యాలెన్స్ విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ మాదిరిగా వాడుకోవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా అన్ని సేవింగ్ అకౌంట్లలో మినిమం యావరేజ్ బ్యాలెన్స్ (MAB) నిబంధనను తొలగించాలని నిర్ణయించింది. గతంలో, PNB కనీస బ్యాలెన్స్ లేని అకౌంట్లపై పెనాల్టీలు వేసేది. ఈ కొత్త నిర్ణయంతో కస్టమర్లకు రిలీఫ్ దక్కినట్టే..