అమెజాన్ సీఈవో ప్రపంచంలోనే ధనవంతడైతే… మాజీ భార్య ఆయనిచ్చిన భరణంతో… సెకండ్ రిచ్చెస్ట్ విమెన్‌గా అవతరించింది

  • Publish Date - July 2, 2020 / 03:18 PM IST

అమెజాన్ సీఈఓ, వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచ ధనవంతుడిగా రికార్డు సృష్టించారు. ఆయన మాజీ భార్య రెండో సంపన్న మహిళగా నిలిచింది. గత ఏడాది విడాకుల పరిష్కారంతో Amazon.com Incలో తన వాటాలో నాలుగింట ఒక వంతును జెఫ్ బెజోస్ వదులుకున్నారు. తన నికర ఆదాయంలో నుంచి మాజీ భార్యకు భరణంగా ఇవ్వడంతో మునుపటి గరిష్ట స్థాయికి పడిపోయింది. సీటెల్ ఆధారిత రిటైలర్ షేర్లు బుధవారం (జూలై 1) 4.4శాతం పెరిగి రికార్డు స్థాయిలో 2,878.70 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ కుబేరిడి సంపదను 171.6 బిలియన్ డాలర్లకు పెంచింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. సెప్టెంబర్ 4, 2018న జెఫ్.. మునుపటి నికర ఆదాయం కంటే అత్యధికంగా 167.7 బిలియన్ డాలర్లలో అగ్రస్థానంలో ఉంది.

ఈ ఏడాదిలో జెఫ్ ఒక్కరే 56.7 బిలియన్లతో లాభాలు గడించారు. ఆర్థిక మాంద్యం సమయంలో అమెరికాలో సంపదను పెంచేశాయి. పబ్లిక్ ఆఫర్లు, తేలికైన ఈక్విటీ మార్కెట్లు పది లక్షల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయినప్పటికీ కూడా భారీ లాభాలను అందించాయి. అమెజాన్ చాలా మంది ఫ్రంట్-లైన్ కార్మికులకు వన్-టైమ్ 500 డాలర్ల బోనస్ ఇవ్వడానికి సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.

అమెజాన్ సంస్థ జెఫ్ సంపదపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. బెజోస్ 11శాతం స్టాక్‌ను కలిగి ఉన్నారు. ఇందులో అతని సంపదే ఎక్కువ భాగం ఉంది. అతిపెద్ద ఆదాయ లాభాలు పొందిన వారిలో ఎక్కువ మంది టెక్ రంగానికి చెందినవారే ఉన్నారు. వీరిలో Tesla Inc. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ Elon Musk కూడా ఉన్నారు. జనవరి 1 నుంచి తన సంపద 25.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ఇంక్ వ్యవస్థాపకుడు Eric Yuan కూడా ఇందులో ఉన్నారు.

జెఫ్ బెజోస్ జంట విడాకుల అనంతరం మాజీ భార్య Mackenzie Bezos భరణంగా అమెజాన్ నుంచి 4 శాతం వాటాను ఆమె సొంతం చేసుకున్నారు. దాంతో జెఫ్ సంపాదన దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13.1 బిలియన్ డాలర్లుకు పెరిగింది. ఆమె నికర సంపద 56.9 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో Mackenzie Bezos 12వ స్థానానికి చేరుకున్నారు. ఇటీవలే అలిస్ వాల్టన్ జూలియా ఫ్లెషర్ కోచ్ లను దాటేసి ప్రపంచంలోని రెండవ సంపన్న మహిళగా నిలిచారు. ఇప్పుడు లోరియల్ వారసురాలు Francoise Bettencourt Meyers మాత్రమే ముందు స్థానంలో ఉన్నారు.

Read:Whatsup లో కొత్త ఫీచర్స్ ఇవే

ట్రెండింగ్ వార్తలు