National Road Safety Week : తెలంగాణలో జియో ‘నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్’..

తెలంగాణ రాష్ట్రంలో జియో త‌న ప‌ని ప్ర‌దేశాల‌న్నింటిలోనూ నేష‌న‌ల్ రోడ్ సేప్టీ వీక్‌ను నిర్వ‌హించింది.

JIO national road safety week in telangana

జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌తా వారోత్స‌వాల‌ను రోడ్డు ర‌వాణా అండ్ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 11వ తేదీ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి 35వ నేష‌న‌ల్ రోడ్ సేఫ్టీ వీక్ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జియో త‌న ప‌ని ప్ర‌దేశాల‌న్నింటిలోనూ నేష‌న‌ల్ రోడ్ సేప్టీ వీక్‌ను నిర్వ‌హించింది. ఉద్యోగుల‌కు ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, వారు బ‌య‌ట‌కు వెళ్లిన సంద‌ర్భాల్లో సుర‌క్షితంగా ఉండేలా క్యాంపెయిన్ న్‌ను నిర్వ‌హించింది.

త‌మ ఫీల్డ్ టీమ్‌కి అర్థం అయ్యేందుకు అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. సీనియ‌ర్ మేనేజ్‌మెంట్ బృందం ర‌హ‌దారి భ‌ద్ర‌త ప్రాముఖ్య‌త పై అవగాహ‌న సెష‌న్‌ల‌ను నిర్వ‌హించారు. త‌మ ఉద్యోగుల కోసం రోడ్ సేఫ్టీ సినిమాను ప్ర‌ద‌ర్శించింది. అనంత‌రం రోడ్డు సేప్టీ పై ర్యాలీ నిర్వ‌హించడంతో పాటు పోస్ట‌ర్‌ను ప్ర‌ద‌ర్శ‌న సైతం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో కన్స్ట్రక్షన్, నెట్‌వర్క్, ఆపరేషన్స్ & మెయింటెనెన్స్, సెక్యూరిటీ, ఇత‌ర డిపార్ట్మెంట్ స‌భ్యులు అంద‌రూ పాల్గొన్నారు. ఈకార్య‌క్ర‌మాల‌కు ఉద్యోగుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న రావ‌డంతో జియో రోడ్డు భ‌ద్ర‌తా కార్య‌క్ర‌మాల‌ను ఒక నెల పాటు కొన‌సాగించ‌నుంది.

Gold Rate Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతంటే?