Jio New Record _ Jio Users Set a New Record, Use 10 Exabyte Data in a month
Jio New Record : రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లు సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒకే ఒక నెలలో బిలియన్ల GB డేటాను వినియోగించి హిస్టరీ క్రియేట్ చేశారు. జియో యూజర్లు (Jio Users) ఒక నెలలో 10 ఎక్సాబైట్ అంటే.. 10 బిలియన్ GB డేటాను వినియోగించారు. ఒక్కో జియో యూజర్ నెలకు 23.1 GB డేటాను వినియోగిస్తున్నారు. ఇంతగా జియో డేటా వినియోగం పెరగడానికి ప్రధాన కారణం ఒక్కటే.. జియో ట్రూ 5G సర్వీసులు (Jio True 5G Services). జియో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో ఫైబర్ కనెక్షన్లు తీసుకునే యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. తద్వారా బిలియన్ల GB డేటా వినియోగానికి దారితీసింది.
2016లో టెలికం రంగంలోకి జియో ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక టెలికం నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆయా నెట్‌వర్క్‌ల వినియోగం కేవలం 4.6 ఎక్సాబైట్స్ మాత్రమే.. అది కూడా ఒక నెలలో కాదు.. మొత్తం సంవత్సరంలోని డేటా వినియోగమంటే ఆశ్చర్యపోవాల్సిందే.. 2016 ఏడాదికి ముందు డేటా వినియోగం అంతగా ఉండేది కాదు.. జియో రాకతో డేటా వినియోగం భారీగా పెరిగింది. అప్పటినుంచి డేటా సంచలనంగా జియో మారింది. భారతీయ టెలికం మార్కెట్లో మొట్టమొదటిసారిగా ఒక టెలికం నెట్‌వర్క్‌లో కేవలం ఒకే నెలలో 10ఎక్సాబైట్ల డేటా వినియోగించారు.
మార్చి త్రైమాసికంలో జియో నెట్‌వర్క్‌లో డేటా వినియోగం 30.3 ఎక్సాబైట్స్‌గా నమోదైంది. దీనికి సంబంధించి వివరాలను రిలయన్స్ జియో తన త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. గత రెండు ఏళ్లలో జియో డేటా వినియోగం 1.8 రెట్లు పెరిగింది. సగటు యూజర్ ప్రతి నెలా 1,003 వాయిస్ నిమిషాలను వినియోగిస్తున్నారు. ఒక నెలలో.. ఒకే టెలికాం కంపెనీ డేటా వినియోగం 10 ఎక్సాబైట్‌లను దాటడం ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో డేటా మొత్తం వినియోగం 30.3 ఎక్సాబైట్‌గా ఉంది.
జియో డేటా వినియోగం పెరగడానికి కారణం ఇదే.. :
ఒక్కసారిగా జియో డేటా వినియోగం ఎందుకు పెరిగిందంటే.. దానికి కారణం.. జియో ట్రూ 5G సర్వీసులను చెప్పవచ్చు. జియో డేటా వినియోగం పెరగడంలో జియో ట్రూ 5G (Jio True 5G) కీలక పాత్ర పోషించింది. సగటు జియో యూజర్ ప్రతి నెలా 23.1 GB డేటాను వినియోగిస్తున్నారు. అదే రెండేళ్ల క్రితం డేటాను పరిశీలిస్తే.. 13.3 GBగా నమోదైంది. సగటు వినియోగదారు ఒక నెలలో 10GB అదనపు డేటాను వినియోగిస్తున్నారు.
టెలికం పరిశ్రమలో ఇతర పోటీదారులతో పోలిస్తే.. జియో నెట్‌వర్క్‌లో వినియోగ సగటు డేటా ఎక్కువగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లేటెస్ట్ త్రైమాసిక ఫలితాల గణాంకాల ప్రకారం.. జియో దేశవ్యాప్తంగా 60వేల సైట్‌లలో 3,50,000 కన్నా ఎక్కువ 5G సెల్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఇప్పటివరకు, జియో ట్రూ 5G సర్వీసులు.. భారత్‌లోని 2,300 పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.
Jio New Record _ Jio Users Set a New Record, Use 10 Exabyte Data in a month
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G నెట్‌వర్క్‌గా జియో రూపాంతరం చెందింది. 2023 చివరి నాటికి భారత్ అంతటా 5G సర్వీసులను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. 5G ప్రారంభంతో పాటు, జియో ఎయిర్‌ఫైర్‌బర్ (Airfirber)ను కూడా లాంచ్ చేయనుంది. రాబోయే కొద్ది నెలల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. జియోఫైబర్ (JioFiber), ఎయిర్‌ఫైబర్ (AirFiber)తో 100 మిలియన్ల ఇళ్లను కవర్ చేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.
RIL ఫలితాల్లో మరికొన్ని ఆసక్తికరమైన డేటాను కూడా వెల్లడించాయి. జియో కంపెనీ (ARPU) లేదా ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం నెలకు రూ. 178.8కి పెరిగింది. వినియోగదారులు ప్రతిరోజూ 1,459 కోట్ల వాయిస్ మినిట్స్ (Voice Minutes) వినియోగిస్తున్నారు. అంటే.. సగటు వినియోగదారు ప్రతి నెలా 1,003 నిమిషాల పాటు వాయిస్ కాల్స్ చేస్తున్నారు..