ఫొటోలు లీక్.. ఫీచర్లు ఇవే : Jio Fiber హైబ్రిడ్ set-top-box చూశారా?

డేటా సంచలనం.. రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న కమర్షియల్ లాంచ్ కానుంది. ఇటీవల కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసు ద్వారా డీటీహెచ్, వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు, హైస్పీడ్ ఇంటర్నెట్, ఫిక్స్ డ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులతో పాటు ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా పొందవచ్చు.
ఇప్పటివరకూ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు కనెక్షన్ ఎలా తీసుకోవాలి? డేటా ప్లాన్లు ఏంటి? అనేది రిలయన్స్ రివీల్ చేసింది. నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు ప్యాకేజీల రూపంలో డేటా ప్లాన్లు ఆఫర్ చేస్తున్నారని, యానివల్ డేటా ప్లాన్లు తీసుకున్న కస్టమర్లకు వెల్ కమ్ ఆఫర్ కింద 4K, LED TV కూడా ఉచితంగా అందించనున్నట్టు మాత్రమే తెలుసు. జియో ఫైబర్ సర్వీసులో భాగంగా కస్టమర్లకు అందించబోయే సెటప్ టాప్ బాక్సు ఎలా ఉంటుంది అనేది రివీల్ చేయలేదు.
జియో హైబ్రిడ్ STB ఫీచర్లు ఇవే :
హైబ్రిడ్ జియో ఫైబర్ సెటప్ టాప్ బాక్సు (STB) ద్వారా TV సర్వీసు ఛానళ్లు, OTT స్ట్రీమింగ్ కంటెంట్ సర్వీసులను కూడా ఆఫర్ చేస్తుంది. కానీ, ఇప్పటివరకూ STB సెటప్ టాప్ బాక్సు ఎలా ఉండబోతుంది? ఏ రంగులో ఉంటుంది? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది కంపెనీ కూడా రివీల్ చేయలేదు. జియో అందించే హైబ్రిడ్ STB బాక్స్ కు సంబంధించి ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలపై జియో అఫిషియల్ కలర్ లోగోతో పాటు ఫైబర్ ల్యాండ్ Ethernet RJ45 పోర్ట్, 2-USB పోర్టు, HDMI పోర్టులు ఉన్నాయి. చూడటానికి కోయాక్సిల్ కేబుల్ (MSOs) ఎంతో స్టాండెడ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకేసారి డిఫరెంట్ కనెక్టవిటీ చేసుకునేందుకు వీలుగా ఈ Jio STBను డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. లోకల్ కేబుల్ ఆపరేటర్లు అందించే అన్ని (LCOs) టీవీ ఛానళ్లను ఈ బాక్సు ద్వారా వీక్షించవచ్చు.
DTH మాత్రమే కాదు.. OTT సర్వీసులు కూడా :
ప్యాకేజీలో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సర్వీసులు, డేటాపై FUB limit ఇంటర్నెట్ సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. ఇతర DTH సర్వీసులందించే TataSky, Airtel.. Set-top-Box మాదిరిగానే Jio STB ఇంటర్ ఫేస్ ఒకేలా ఉంటుంది. దీనిపై ఎలక్ట్రానిక్ ప్రొగ్రామింగ్ గైడ్‌తో పాటు TRAI రెగ్యులషన్ ప్రకారం అందించే ఛానళ్ల ధరలు a la carte ప్యాకేజీ కూడా పొందవచ్చు. Hybrid Jio సెటప్ టాప్ బాక్సు ద్వారా వినియోగదారులు జియో అందించే అన్ని స్ట్రీమింగ్ యాప్స్ JioCinema, JioTV, JioSaavan సర్వీసులు కూడా పొందవచ్చు. ఇతర OTT ప్లాట్ ఫాంలు అందించే స్ట్రీమింగ్ కంటెంట్ కూడా జియో సెటప్ టాప బాక్సు ద్వారా ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. జియో Set top boxలో గేమింగ్, వీడియో కాలింగ్, VR, MR (వర్చువల్ రియాల్టీ, మిక్స్ డ్ రియాల్టీ) సర్వీసులను కూడా ఆఫర్ చేయనుంది.
Remote కంట్రోలర్.. Cinema బటన్ ప్రత్యేకం :
జియో STB బాక్సులో Remote Control సౌకర్యంతో పాటు Voice Search సదుపాయం కూడా ఉంది. OTT ప్లాట్ ఫాం నుంచి యూజర్లు టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. జియో STB రిమోట్.. యూనివర్శల్ రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకించి Cinema బటన్ కూడా ఉంటుంది. ప్లే బ్యాక్ కంట్రోల్ బటన్ ఉన్నాయి. జియో ఫైబర్ సెటప్ టాప్ బాక్సు అన్ని పాపులర్ గేమింగ్ కంట్రోలర్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ బాక్సులో గ్రాఫిక్స్ కార్డు ఇన్ బుల్ట్ సెట్ చేసి ఉంది. 4K డిస్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. జియో ఫైబర్ నెట్ వర్క్ ద్వారా
జీరో ల్యాటెన్సీ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. MR షాపింగ్, MR ఎడ్యుకేషన్, MR మూవీ వాచింగ్ వంటి మిక్స్ డ్ రియాల్టీ సర్వీసులను కూడా Jio సెటప్ టాప్ బాక్సు ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు.