భారత అతిపెద్ద టెలికం ఆపరేటర్ రూపొందించిన JioMeet అనే కొత్త మీటింగ్ యాప్ ఆన్ లైన్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రముఖ పాపులర్ మీటింగ్ యాప్ Zoomకు పోటీగా భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇందులోని ఫీచర్లు, అచ్చం Zoom యాప్ మాదిరిగానే పనిచేస్తోంది. అంతేకాదు… 24 గంటల పాటు యూజర్లు ఉచితంగా మీటింగ్స్ కనెక్ట్ అయ్యేందుకు అనుమతి ఇస్తోంది.
JioMeet: A true-blue Zoom copy :
జియో మీట్ యాప్.. అచ్చం చూడటానికి దీని ఇంటర్ ఫేస్… ఫీచర్లు అచ్చం Zoom Copy మాదిరిగానే కనిపిస్తాయి. ట్రూ బ్లూ జూమ్ డిజైన్ తో కొత్తగా ఆకర్షణీయంగా ఉంది. బ్లూ లోగోపై వైట్ కలర్ ఉంది. మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల అడ్రస్ ద్వారా Sign Up అవ్వొచ్చు.
ప్రస్తుతం.. Jio Meet యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ డివైజ్ ల్లో సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు.. Legacy Video కాన్ఫరెన్సింగ్ సిస్టమ్స్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక Jio Meet యూజర్ ఒకే సమయంలో 5 వేర్వేరు డివైజ్ ల్లో నుంచి లాగిన్ అవ్వొచ్చు. కాల్స్ మాట్లాడుతున్న సమయంలోనూ ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ మధ్య Switch అవ్వొచ్చు.
ఇంతకీ.. ఇది సెక్యూరేనా? :
ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే… JioMeet కాల్స్ encrypted చేయడం జరిగిందని తన వెబ్ సైట్లో కంపెనీ వెల్లడించింది. కానీ, end-to-end encryption వినియోగం ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.
* అదే Zoom ప్లాట్ ఫాంలో మాత్రం Upgraded తో పాటు encryption మౌలిక సదుపాయాలతో సెక్యూర్ కలిగి ఉంది. జూమ్ మాదిరిగా జియో మీట్ కూడా ఇతర వీడియో కాలింగ్ సర్వీసులకు గట్టి పోటీదారునిగా మార్కెట్లోకి వచ్చింది.
Where is JioMeet available?
Zoom వీడియో ప్లాట్ ఫాం మాదిరిగా Jio Meet కూడా గ్లోబల్ సర్వీసు లేదా ఇండియాలో మాత్రమే వర్క్ చేస్తుందా అనడానికి స్పష్టత లేదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లోని యూజర్లు కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ యాక్సస్ చేసుకున్నామని అంటున్నారు. ఈ విషయంలో రిలయన్స్ జియో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.