Student Laptops : స్టూడెంట్స్ కోసం రూ.50వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్స్ మీకోసం..!

Student Laptops : విద్యార్థుల కోసం టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ మోడల్స్ జాబితాను ఓసారి లుక్కేయండి..

Student Laptops

Student Laptops : స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి.. అందరూ స్టడీకి సంబంధించిన గాడ్జెట్లను కొనేందుకు చూస్తుంటారు. అందులో ప్రధానంగా చాలామంది విద్యార్థులు ల్యాప్ టాప్స్ కొనేందుకు ఇష్టపడుతుంటారు.

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే అనేక మోడల్ ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి రూ. 50వేల కన్నా తక్కువ ధరలో విద్యార్థుల కోసం అద్భుతమైన ల్యాప్‌టాప్స్ ఎంచుకోవచ్చు. అది కూడా సరసమైన ధరలకే కొనేసుకోవచ్చు.

Read Also : Apple M4 MacBook Air : కొత్త ఆపిల్ ల్యాప్‌టాప్ ఇదిగో.. అతి తక్కువ ధరకే M4 మ్యాక్‌బుక్ ఎయిర్.. ఇలా కొనేసుకోండి..!

మల్టీ-కోర్ ప్రాసెసర్‌లతో స్టడీకి సంబంధించి ఫాస్ట్ మల్టీ టాస్కింగ్‌ చేసేలా ఉంటాయి. 4GB నుంచి 8GB వరకు ర్యామ్, 256GB SSD నుంచి స్టోరేజీ ఆప్షన్లు, ఎడ్యుకేషనల్ సాఫ్ట్‌వేర్, ప్రైమరీ మీడియా ఎడిటింగ్ టూల్స్ వంటి ఫీచర్లతో విద్యార్థులను ఆకట్టుకునేలా ఉన్నాయి. విద్యార్థులు ఫైల్స్, అప్లికేషన్‌లను త్వరగా యాక్సెస్ చేయొచ్చు.

ఈ ల్యాప్‌టాప్‌లు బిల్డ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి. ఈజీగా క్యారీ చేయొచ్చు. కాంపాక్ట్ మొబిలిటీ ఇష్టపడే వారికి 10-అంగుళాల ల్యాప్‌టాప్‌లు పోర్టబిలిటీని అందిస్తాయి. మల్టీమీడియా కంటెంట్ కోసం ఫుల్ HD డిస్‌ప్లే కలిగి ఉంటాయి.

USB పోర్ట్‌లు, Wi-Fi వంటి కనెక్టివిటీ ఫీచర్లతో విద్యార్థులు లైబ్రరీలో లేదా కేఫ్‌లో కనెక్ట్ అవ్వొచ్చు. విద్యార్థుల కోసం టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ మోడల్స్ జాబితాను ఓసారి లుక్కేయండి..

1. లెనోవా V15 G4 82C70081GE :
ఈ లెనోవా మోడల్ విద్యార్థులకు మంచి బడ్జెట్ ల్యాప్‌టాప్. AMD రైజెన్ 5 7520U ప్రాసెసర్, 16GB DDR5 ర్యామ్, 512GB SSDతో స్కూల్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, ప్రెజెంటేషన్‌లకు బెస్ట్. ఫుల్ HD డిస్‌ప్లే, రేడియన్ గ్రాఫిక్స్ కంటెంట్ కలిగి ఉంది.

2. అసూస్ వివోబుక్ 16 X1605ZAC-MB540WS :
అసూస్ వివోబుక్ ల్యాప్‌టాప్ మల్టీ టాస్కింగ్ అవసరమయ్యే విద్యార్థులకు బెస్ట్. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSDని కలిగి ఉంది. 16-అంగుళాల WUXGA స్క్రీన్ క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇంటెల్ ఐరీస్ Xe గ్రాఫిక్స్ సపోర్టు ఇస్తుంది.

3. అసూస్ వివోబుక్ 15 X1504VA-NJ3321WS :
ఈ అసూస్ ల్యాప్‌టాప్ అనేది విద్యాపరమైన పనులు మాత్రమే కాదు.. రోజువారీ వినియోగానికి బెస్ట్ ల్యాప్‌టాప్. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. డాక్యుమెంట్లు, వెబ్ యాక్సెస్, లెక్చర్‌లను కూడా యాక్సస్ చేయొచ్చు.

4. ఏసర్ ఆస్పైర్ 7 A715-76G UN.QMYSI.002 :
ఈ ఏసర్ ఆస్పైర్ మోడల్ హై పర్ఫార్మెన్స్ కోరుకునే విద్యార్థులకు బెస్ట్. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. 4GB NVIDIA గ్రాఫిక్స్ డిజైన్ గేమింగ్‌కు బెస్ట్ ఆప్షన్.

5. హెచ్‌పీ 15-FC0154AU
ఈ మోడల్ పర్ఫార్మెన్స్, సరసమైన ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్ AMD Ryzen 3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSD కలిగి ఉంది. విద్యార్థులకు రీసెర్చ్, వీడియో కాల్స్, బేసిక్ మల్టీమీడియాకు సపోర్టు ఇస్తుంది.

6. శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 NP750XGJ-LG4IN :
ఈ శాంసంగ్ మోడల్ ఆకర్షణీయమైన ప్రొఫైల్ కలిగి ఉంది. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 512GB SSD పోర్టబిలిటీ, పవర్ అందిస్తుంది. విద్యార్థులకు అడ్వాన్స్ రీసెర్చ్‌కు బెస్ట్ మోడల్.

7. అసూస్ ఎక్స్‌పర్ట్‌బుక్ P1 P1503CVA-ST1074WS :
అసూస్ మోడల్ 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 16GB ర్యామ్ కలిగి ఉంది. క్లాసులు, అసైన్‌మెంట్‌లు, క్రియేటవిటీగా ఉండే విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది.

Read Also : Social Media Ban : 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్? సంచలనం దిశగా..!

8. హెచ్‌పీ 15-FD0574TU :
HP 15-fd0574TU టాప్ మెమరీని కోరుకునే విద్యార్థులకు బెస్ట్. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSDని కలిగి ఉంది. మల్టీ-ట్యాబ్ రీసెర్చ్, ఆన్‌లైన్ టూల్స్, HD స్ట్రీమింగ్‌కు బెస్ట్ మోడల్.

9. ఏసర్ ఆస్పైర్ లైట్ AL15-41
ఈ ఏసర్ ఆస్పైర్ ఎలైట్ మోడల్ విద్యార్థులకు అద్భుతమైన ఆప్షన్. ఎఎండీ రైజన్ 5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSDతో రోజువారీ టాస్కులకు ప్రాజెక్ట్ వర్క్ కోసం లాగ్-ఫ్రీ ఆపరేషన్‌ అందిస్తుంది.