Lava Yuva 3 Pro Specifications : అత్యంత సరసమైన ధరకే లావా యువ 3 ప్రో ఫోన్.. స్పెషిఫికేషన్లు, ధర ఎంతంటే?
Lava Yuva 3 Pro Specifications : లావా కంపెనీ నుంచి లేటెస్ట్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త లావా యువ 3 ఫోన్ 50ఎంపీ కెమెరాలతో భారత మార్కెట్లో లాంచ్ అయింది. పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.

Lava Yuva 3 Pro With 50-Megapixel Dual Rear Cameras, 5,000mAh Battery Launched
Lava Yuva 3 Pro Specifications : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త లావా యువ 3 ప్రో ఫోన్ గురువారం (డిసెంబర్ 14) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఏజీ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది.
లావా యువ 3 ప్రో యూనిసెక్ టీ616 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్‌తో 50ఎంపీ మెయిన్ సెన్సార్, హెచ్డీ+ డిస్ప్లే, 5,000ఎంహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కొత్త లావా స్మార్ట్‌ఫోన్ ఇతర ముఖ్య ఫీచర్లను అందిస్తోంది.
భారత్‌లో లావా యువ 3 ప్రో ధర, లభ్యత :
లావా యువ 3 ప్రో ఫోన్ సింగిల్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 8,999కు పొందవచ్చు. ప్రస్తుతం లావా రిటైల్ నెట్వర్క్, లావా ఇ-స్టోర్‌లో డెసర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్, మెడో పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈరోజు నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
లావా యువ 3 ప్రో స్పెసిఫికేషన్స్ :
డ్యూయల్ సిమ్ (నానో) లావా యువ 3 ప్రో ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను స్వీకరించి అప్‌గ్రేడ్ చేస్తుంది. 269పీపీఐ పిక్సెల్ సాంద్రత, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్డీ+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్‌తో డిస్ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసెక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది.

Lava Yuva 3 Pro 50-Megapixel Dual Rear Cameras
వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో అదనపు స్టోరేజీతో ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు విస్తరించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. లావా యువ 3 ప్రో ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఏఐ-సపోర్టు గల 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. హెచ్డీఆర్, పోర్ట్రెయిట్, పనోరమా, బర్స్ట్, స్లో మోషన్, నైట్, టైమ్-లాప్స్ ఫొటోగ్రఫీతో సహా పలు కెమెరా మోడ్లకు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో చాట్లకు స్క్రీన్ ఫ్లాష్‌తో ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా సెన్సార్ అందిస్తుంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించవచ్చు.
లావా యువ 3 ప్రోలో కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఎసి, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. అథెంటికేషన్ విషయానికి వస్తే.. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో ఏజీ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉంది.
లావా 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో కొత్త యువ 3 ప్రోలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసింది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 38 గంటల టాక్ టైమ్, 500 గంటల స్టాండ్‌బై టైమ్‌ని అందజేస్తుంది. ఒక్క ఛార్జ్‌పై 468 నిమిషాల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ హ్యాండ్సెట్ 165×76.1×8.7ఎమ్ఎమ్ కొలతలు, 200 గ్రాముల బరువు ఉంటుంది.