Lenovo Tab Plus Gen 2 : 10,200mAh బ్యాటరీ, 120Hz LCD డిస్ప్లేతో లెనోవో కొత్త ట్యాబ్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
Lenovo Tab Plus Gen 2 : కొత్త ట్యాబ్లెట్ కోసం చూసేవారికి గుడ్ న్యూస్.. 10,200mAh బ్యాటరీ, 120Hz LCD డిస్ప్లేతో లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 రిలీజ్ అయింది.. ఫీచర్ల కోసమైన ఈ ట్యాబ్ సొంతం చేసుకోవచ్చు.
Lenovo Tab Plus Gen 2
- లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 12.1-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది
- ట్యాబ్‌లో డాల్బీ విజన్, HDR10 సపోర్ట్ కూడా అందిస్తుంది
- మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు
Lenovo Tab Plus Gen 2 : కొత్త ట్యాబ్ కొనేవారికి అద్భుతమైన అవకాశం.. లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్ వచ్చేసింది. లెనోవో ప్లస్ జెన్ 2 పేరుతో కంపెనీ స్పెషల్ ఫీచర్లతో టాబ్లెట్ లాంచ్ చేసింది. ఈ అద్భుతమైన టాబ్లెట్ 12.1-అంగుళాల LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ఈ టాబ్లెట్ పవర్ఫుల్ మీడియాటెక్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో సౌండ్ సిస్టమ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. 9-యూనిట్ JBL ప్రో స్పీకర్లు ఉన్నాయి. అద్భుతమైన సౌండ్ (Lenovo Tab Plus Gen 2) ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 టాబ్లెట్ ధర, ఇతర ముఖ్య ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధర ఎంతంటే? :
ప్రపంచవ్యాప్తంగా లెనోవా ట్యాబ్ ప్లస్ జెన్ 2 400 డాలర్లు (దాదాపు రూ. 37,500) ధరకు లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో లిస్ట్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు కొనేసుకోవచ్చు.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 12.1-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ అందిస్తుంది. 2.5K రిజల్యూషన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ట్యాబ్లెట్ డాల్బీ విజన్, HDR10కు కూడా సపోర్టు ఇస్తుంది. 800 నిట్స్ టాప్ బ్రైట్నెస్ సపోర్టు ఇస్తుంది. కంపెనీ 360 డిగ్రీలు ఇంటర్నల్ కిక్స్టాండ్ను అందించింది.
ఈ టాబ్లెట్ మెయిన్ ఫీచర్ సౌండ్.. స్పెషల్ బాస్ యూనిట్, డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో సినిమాటిక్ ఆడియో సిస్టమ్ ఉంది. బ్లూటూత్ స్పీకర్ మోడ్ కూడా ఉంది. తద్వారా మీ ఫోన్‌కు పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌గా పనిచేస్తుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలకు బెస్ట్ ఆప్షన్.
లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో రన్ అవుతుంది. కంపెనీ ఇందులో 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ అందించింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.
ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,200mAh బ్యాటరీతో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 13MP ఆటోఫోకస్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
