ఈ బైక్‌పై వెళ్తుంటే ఆ రాజసమే వేరు.. హార్లీ డేవిడ్‌సన్ 2025 లైనప్ వచ్చేసింది.. ధరలు, అద్భుతమైన ఫీచర్లు.. ప్రీ బుకింగ్స్ ఓపెన్..

మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుంది? 2025 హార్లీ-డేవిడ్‌సన్ ధరల పూర్తి జాబితా..

ప్రతి బైక్ రైడర్ కల హార్లీ-డేవిడ్‌సన్. ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది. హార్లీ-డేవిడ్‌సన్ ఇండియా తమ సరికొత్త 2025 మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ, శక్తిమంతమైన పనితీరుతో ఈ లైనప్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌లలో ప్రీ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఈ కొత్త లైనప్‌లో ఏముందో, ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం..

2025 లైనప్‌లో కొత్తగా ఏముంది?

  • ఈసారి హార్లీ-డేవిడ్‌సన్ కేవలం ఇంజన్‌పైనే కాకుండా, స్టైల్, టెక్నాలజీపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.
  • డిజైన్: ప్రతి మోడల్‌లోనూ డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు చేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
  • అధునాతన టెక్నాలజీ: రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను సులభతరం చేసేందుకు కొత్త టెక్ ఫీచర్లను జోడించారు.
  • లిమిటెడ్ ఎడిషన్ CVO సిరీస్: ఈ ఏడాది 26వ ఎడిషన్‌గా, కస్టమ్ వెహికల్ ఆపరేషన్స్ (CVO) లైనప్‌లో CVO Street Glide, CVO Road Glide మోడళ్లను పరిచయం చేశారు. ఇవి లిమిటెడ్ ఎడిషన్ కావడంతో ప్రత్యేక గుర్తింపును పొందనున్నాయి.

Also Read: 2 షాకింగ్‌ ఘటనలు.. కొడుక్కి చూసిన అమ్మాయిని పెళ్లాడిన తండ్రి.. కూతురికి కాబోయే భర్తతో తల్లి పరార్

మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుంది? 2025 హార్లీ-డేవిడ్‌సన్ ధరల పూర్తి జాబితా.. 

మోడల్ పేరు ఎక్స్-షోరూమ్ ధర (సుమారుగా)
HD X440 రూ.2.40 లక్షలు
HD Nightster రూ.13.51 లక్షలు
HD Nightster Special రూ.14.29 లక్షలు
HD Sportster S రూ.16.70 లక్షలు
HD Heritage Classic రూ.23.85 లక్షలు
HD Fatboy రూ.25.90 లక్షలు
HD Pan America Special రూ.రూ.25.10 లక్షలు
HD Breakoutరూ. రూ.37.19 లక్షలు
HD Street Glide రూ.39.30 లక్షలు
HD Road Glide రూ.42.30 లక్షలు

ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణలు 

స్ట్రీట్ బాబ్ గ్రాండ్ రీ-ఎంట్రీ

హార్లీ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Street Bob 117 మళ్లీ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇది ఫ్యాట్ బాబ్ స్థానాన్ని భర్తీ చేయనుంది.

కొత్త ఇంజన్: శక్తిమంతమైన Milwaukee-Eight 117 V-Twin ఇంజన్‌తో వస్తోంది.

స్టైల్: అగ్రెసివ్ బాబర్ స్టైల్, మినీ-ఏప్ హ్యాండిల్‌బార్స్, రైడర్-ఫోకస్డ్ డిజైన్‌తో యువతను ఆకట్టుకోవడం ఖాయం.

CVO సిరీస్

టూరింగ్ అంటే ఇష్టపడే, హై-ఎండ్ టెక్నాలజీని కోరుకునే వారి కోసం CVO Street Glide, CVO Road Glide మోడళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవి లిమిటెడ్ ఎడిషన్ కావడంతో రోడ్లపై ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. వీటి ధరలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది.

ప్రీ-బుకింగ్స్ ప్రారంభం 

ప్రస్తుత ఏడాది లైనప్‌లోని అన్ని మోడళ్లను మీ సమీపంలోని హార్లీ-డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌లో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. సిటీ రైడ్స్ కోసం Nightster నుంచి, లాంగ్ హైవే టూర్ల కోసం Road Glide వరకు… ప్రతి రైడర్ అవసరానికి తగిన బైక్ ఈ లైనప్‌లో ఉంది.