Loan Closure Alert : లోన్ క్లోజ్ చేస్తున్నారా? జర జాగ్రత్త.. ఈ 5 డాక్యుమెంట్లను అర్జెంట్‌గా తీసుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు!
Loan Closure Alert : మీరు బ్యాంకు లోన్ క్లోజ్ చేయాలనుకుంటే ముందుగా కొన్ని డాక్యుమెంట్ల గురించి తప్పక అవగాహన ఉండాలి. లేదంటే భవిష్యత్తులో భారీగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది..
- Sreehari A
- Published On : April 8, 2026 / 07:35 AM IST
Loan Closure Alert
- లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారా?
- మీ లోన్ ఏదైనా సరే ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు
- బ్యాంకును అడిగి మరి ఈ 5 డాక్యుమెంట్లను తెచ్చుకోండి
Loan Closure Alert : మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారా? అయితే, ఇప్పుడు లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారా? ఈ విషయంలో జర జాగ్రత్త.. చాలామంది లోన్ చివరి ఈఎంఐ కట్టకగానే లోన్ బాధ తీరిపోయిందిలేని సంబరపడిపోతుంటారు.
వాస్తవానికి, మీరు లోన్ క్లోజ్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ లోన్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నట్టుగా చూపిస్తుంటుంది. ఇది తెలియక చాలామంది లోన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఒకవేళ మీరు లోన్ క్లోజ్ చేయాలని భావిస్తుంటే కొన్ని విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి. లోన్ క్లోజ్ చేసిన వెంటనే బ్యాంకు దగ్గర నుంచి 5 డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకోండి. ఇది అసలు మరవద్దు.
సాధారణంగా మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు లేదంటే హోం లోన్, వెహికల్ లోన్ కావొచ్చు.. ఇలా ఏదైనా చివరి ఈఎంఐ చెల్లించగానే లోన్ మొత్తం క్లియర్ అయినట్టు భావించొద్దు. మీరు తర్వాత వెంటనే బ్యాంకు నుంచి ఈ 5 డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకోండి. ఇంతకీ అవేంటో ఓసారి వివరంగ తెలుసుకుందాం..
ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తీసుకోమ్మని అడగదు కదా.. అలాంటప్పుడు మనం అడిగి ఎందుకు తీసుకోవాలి అని సందేహమా? అయితే మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం.. బ్యాంకులు కూడా లోన్ క్లోజ్ చేశాక ఈ డాక్యుమెంట్లను బ్యాంకులు నేరుగా ఇవ్వవు.
ఒకవేళ మీరు తీసుకోవడం మర్చిపోతే బ్యాంకు లోన్ కట్టినట్టే.. కానీ, లోన్ స్టేటస్ యాక్టివ్ ఉంటే మాత్రం మీ లోన్ ఇంకా క్లోజ్ కాలేదని అర్థం.. అప్పుడు అది క్రెడిట్ స్కోరు మీద దెబ్బ పడుతుంది. భవిష్యత్తులో ఏదైనా కొత్త లోన్లు తీసుకునేటప్పుడు అసలు ఇబ్బందులు మొదలవుతాయి.
ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏంటంటే? :
1. లోన్ క్లోజర్ సర్టిఫికేట్ : మీరు తీసుకున్న లోన్ అధికారికంగా క్లోజ్ అయిందని సూచిస్తుంది.
2. నో డ్యూస్ సర్టిఫికేట్ (NDC/NOC) : మీరు బ్యాంకుకు ఎలాంటి బాకీ లేరని తెలియజేసే డాక్యుమెంట్. భవిష్యత్తులో లీగల్ ఎలాంటి సమస్య వచ్చినా ఈ డాక్యుమెంట్ చూపించొచ్చు.
3. ఒరిజినల్ డాక్యుమెంట్లు : లోన్ తీసుకున్న సమయంలో మీరు బ్యాంకులో సబ్మిట్ చేసిన ఒరిజినల్ ఆస్తి డాక్యుమెంట్లు, సేల్ డేట్ లేదా వెహికల్ పేపర్లు, అన్ని తిరిగి తీసుకోవాలి.
4. లీన్ రిమూవల్ లేదా హైపోతికేషన్ : మీరు లోన్ టర్మ్ ఉన్నంతవరకూ మీ ఆస్తి లేదా వాహనంపై బ్యాంకుకు హక్కు ఉంటుంది.
5.లోన్ క్లోజ్ అయ్యాక రిజిస్ట్రార్ ఆఫీసుకు అది హోం లోన్ అయితే లేదా ఆర్టీఓ ఆఫీసుకు అది వెహికల్ లోన్ అయితే ఏది అంటే అక్కడికి వెళ్లి లీన్ రిమూవ్ చేయించుకోవాలి. అప్పుడే మీ ఆస్తి లేదా వెహికల్ మీద మీకు పూర్తి రైట్ వస్తుంది అనమాట.
