కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో రోజువారి పనులతో కడుపునింపుకునే కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అలాంటి వారికోసం సెలబ్రెటీలు, ప్రముఖ సంస్ధలు విరాళాలు ఇచ్చి వారి కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ Parle-G ముందుకు వచ్చింది. ప్రభుత్వ సంస్థల ద్వారా 3 కోట్ల బిస్కెట్ పాకెట్లను విరాళంగా ఇస్తామని పార్లే ప్రొడక్ట్స్ బుధవారం (మార్చి 25, 2020)న ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ బిస్కెట్లతో ఆకలితో ఉన్న పేదలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారి జీవనోపాధికి అంతరాయం కలుగుతుంది, వారు ఆకలితో ఉండకుండా చూసుకోవడానికి మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు.
అంతేకాదు బుధవారం (మార్చి 25, 2020)న పేద ప్రజలు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా వారికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతూ నామాలగుండు కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్ నోములు ప్రకాశ్ రావు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
Also Read | ఇండియా ఐసోలేషన్ వార్డుల్లో రోబోల ట్రీట్‌మెంట్