MSSC Scheme : మహిళలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మార్చి 31లోగా ఇందులో పెట్టుబడి పెట్టండి.. రెండేళ్లలో మీ డబ్బు డబుల్ అవుతుంది!

MSSC Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో పెట్టుబడికి తక్కువ సమయం మాత్రమే ఉంది.

Mahila Samman Saving Certificate

MSSC Scheme : మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు అద్భుతమైన అవకాశం. మీరు ఇంకా ఈ పథకంలో పెట్టుబడి పెట్టలేదా? అయితే ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే.. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉంది.

Read Also : PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? అసలు కారణం ఇదే.. ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలంటే?

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. మహిళా సమ్మాన్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31, 2025. ఈ పథకంలో ఇంకా పెట్టుబడి పెట్టని మహిళలకు మార్చి 2025 వరకు మాత్రమే సమయం ఉంది.

మహిళలు పెద్ద మొత్తాల్లో సేవింగ్స్ చేయడం ద్వారా అద్భుతమైన రాబడిని పొందడానికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. భారత ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం MSSC (మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికేట్) పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం 31 మార్చి 2023న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రారంభమైంది. రెండు సంవత్సరాల పాటు అమలు చేస్తారు. మహిళలను ఆర్థికంగా సాధికారపరచడం, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యంగా చెప్పవచ్చు.

ఎంఎస్ఎస్‌సీ (MSSC)స్కీమ్ ప్రత్యేకత ఏంటి? :
ఎంఎస్ఎస్‌సీ (MSSC)స్కీమ్ సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. బ్యాంకుల 2 సంవత్సరాల FD కన్నా ఎక్కువ. ఈ పథకం సురక్షితమైన పెట్టుబడితో అధిక రాబడిని అందిస్తుంది. పోస్టాఫీసు లేదా రిజిస్టర్డ్ బ్యాంకులలో అకౌంట్ సులభంగా ఓపెన్ చేయొచ్చు.

మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు?

కనీస పెట్టుబడి : రూ. 1,000
గరిష్ట పెట్టుబడి : రూ. 2,00,000

2 ఏళ్ల వ్యవధి తర్వాత మొత్తం అసలు, వడ్డీ తిరిగి పొందవచ్చు.
ఒక ఏడాది తర్వాత, ఖాతాదారులు 40శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

మహిళా సమ్మాన్ యోజన నియమాలివే :
తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారుడి మరణం వంటి ప్రత్యేక పరిస్థితులలో ఖాతాను అకాలంగా క్లోజ్ చేయొచ్చు.
ఖాతాదారుడు 6 నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది. మీరు 31 మార్చి 2025 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Read Also : Digital Gold : డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టడం ఎలా? కలిగే లాభాలేంటి? ఫిజికల్ గోల్డ్ కన్నా ఎంతవరకు సేఫ్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

ఎంఎస్ఎస్‌‌సీ (MSSC) పథకాన్ని మరింత పొడిగించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో, మార్చి 31, 2025 నాటికి పెట్టుబడి పెట్టడం చాలా అవసరం.

మహిళలకు సురక్షితమైన, అధిక వడ్డీ రేటును అందించే పెట్టుబడి ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు ఇంకా పెట్టుబడి పెట్టకపోతే త్వరగా సమీపంలోని పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసి మీ పెట్టుబడిని పెట్టండి.