Mahindra Scorpio N : మహీంద్రా కొత్త కారు కేక.. పనోరమిక్ సన్‌రూఫ్, ADAS సేఫ్టీ ఫీచర్లతో స్కార్పియో N ఆగయా.. ధర, మైలేజీ ఎంతంటే?
Mahindra Scorpio N : మహీంద్రా నుంచి కొత్త స్కార్పియో N మరో కొత్త మోడల్ వచ్చేసింది. పనోరమిక్ సన్‌రూఫ్, ADAS సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

Mahindra Scorpio N
Mahindra Scorpio N : మహీంద్రా స్కార్పియో N ఇండియాలో SUV కారు చాలా పాపులర్. 2022 నుంచి అడ్వాన్స్‌డ్ డిజైన్, టెక్నాలజీ, అనేక కొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. తాజాగా కంపెనీ అప్‌డేట్ చేసిన ‘స్కార్పియో N’ SUV కొత్త మోడల్ భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ SUV కారులో లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా అత్యధికంగా అమ్ముడైన SUV స్కార్పియో N లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సేఫ్టీ ఫీచర్లతో ప్రవేశపెట్టింది. కంపెనీ Z8L వేరియంట్‌లో లెవెల్ 2 అడాస్ అందించింది. కొత్త Z8T వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది. కొత్త మహీంద్రా స్కార్పియో N అడాస్ మోడల్ ధర, స్పెసిఫికేషన్లను వివరంగా తెలుసుకుందాం.
మహీంద్రా స్కార్పియో వేరియంట్ ధర :
మహీంద్రా స్కార్పియో N కొత్త Z8T ట్రిమ్ ధర రూ. 20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అడాస్ సేఫ్టీతో కూడిన Z8 L మోడల్ ధర రూ. 21.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో అడాస్ అందిస్తోంది.
మహీంద్రా స్కార్పియో ఫీచర్లు :
మహీంద్రా స్కార్పియో N అడాస్ వేరియంట్‌లో అనేక అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియంతో పాటు మరింత సేఫ్టీ చేస్తుంది. లెవల్-2 అడాస్ కింద ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ పైలట్ అసిస్ట్ కలిగి ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్, ఆటో-హోల్డ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ప్రీమియం ఇంటీరియర్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా మహీంద్రా స్కార్పియో N మోడల్‌లో ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో N ఇప్పటికే బాగా పాపులర్ అయింది. క్వాలిటీకి ప్రసిద్ధి చెందింది. గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కొత్త ADAS ఫీచర్లు భారత మార్కెట్లో అత్యంత సేఫ్టీ ఫ్యామిలీ SUVలలో ఒకటిగా నిలిచింది.
మహీంద్రా స్కార్పియో N ఇంజిన్ :
మహీంద్రా స్కార్పియో N మోడల్ మొత్తం 2 ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 200bhp పవర్, 370Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 172bhp పవర్, 400Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి.
మహీంద్రా స్కార్పియో N మైలేజ్ వివరాలు :
స్కార్పియో N మైలేజ్ ఇంజిన్, వేరియంట్ ఆధారంగా మారుతుంది. పెట్రోల్ మోడల్ లీటరుకు 16.5 నుంచి 18.5 కిమీ మైలేజీని ఇస్తుంది. డీజిల్ మోడల్ లీటరుకు 12.12-15.94 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. మహీంద్రా స్కార్పియో N మోడల్ కొత్త Z8T వేరియంట్ స్కార్పియో N లైనప్‌లో మిడ్- స్పెషిఫికేషన్ మోడల్. మహీంద్రా Z8L కింద Z6 పైన ఉంది. అడ్వాన్స్ సేఫ్టీ కోరుకునే కస్టమర్ల కోసం ఈ వేరియంట్ ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంది.
ధర వివరాలు ఇలా ఉన్నాయి :
మహీంద్రా స్కార్పియో N వేరియంట్ | పెట్రోల్ MT | పెట్రోల్ AT | డీజిల్ 2WD MT | డీజిల్ 2WD AT | డీజిల్ 4WD MT | డీజిల్ 4WD AT |
Z8T | రూ. 20.29 లక్షలు | రూ. 21.71 లక్షలు | రూ. 20.69 లక్షలు | రూ. 22.18 లక్షలు | రూ. 22.80 లక్షలు | రూ. 24.36 లక్షలు |
Z8L (ADAS) 7-సీట్లు | రూ. 21.35 లక్షలు | రూ. 22.77 లక్షలు | రూ. 21.75 లక్షలు | రూ. 23.24 లక్షలు | రూ. 23.86 లక్షలు | రూ. 25.42 లక్షలు |
Z8L (ADAS) 6-సీట్లు | రూ. 21.60 లక్షలు | రూ. 22.96 లక్షలు | రూ. 22.12 లక్షలు | రూ. 23.48 లక్షలు | – | – |