Maruti Suzuki Brezza : 2023లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మారుతి సుజుకి బ్రెజ్జా..!

Maruti Suzuki Brezza : 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతీ సుజుకి బ్రెజ్జా 170,600 యూనిట్లను విక్రయించింది.

Maruti Suzuki Brezza was the best-selling SUV in India in 2023

Maruti Suzuki Brezza : దేశం అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బ్రెజ్జా క్యాలెండర్ ఇయర్ (CY) 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. టాటా నెక్సాన్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ మహీంద్రా స్కార్పియో వంటి మోడల్ కార్లను అధిగమించింది. మారుతి సుజుకి ఇండియా, సీవై23లో 170,600 యూనిట్ల బ్రెజ్జా మోడళ్లను విక్రయించింది.

Read Also : Maruti Suzuki Swift : 2023లో దుమ్మురేపిన మారుతి సుజుకి.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్విఫ్ట్ కారు..!

భారీగా పెరగనున్న మారుతి కార్ల ధరలు :
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా మారుతి ప్రొడక్టు కావడమే విశేషం. 203,500 యూనిట్ల విక్రయాలతో స్విఫ్ట్ ముందంజలో నిలిచింది. ఆ తర్వాత బ్రెజ్జా ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 14.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)లతో నిలిచింది. ఏది ఏమైనప్పటికీ, జనవరి 2024లో మొత్తం ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోలో మారుతి ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో మారుతి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

మారుతి బ్రెజ్జా 5-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఆప్షన్లతో కె15సి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (103పీఎస్/137ఎన్ఎమ్)ను ఉపయోగిస్తుంది. 5-స్పీడ్ ఎంటీతో కూడిన సీఎన్‌జీ వెర్షన్ (88పీఎస్/121ఎన్ఎమ్) కూడా ఉంది. భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో కార్‌మేకర్ న్యూమెరో యునో స్థానంపై దృష్టి సారించింది.

Maruti Suzuki Brezza

ఎస్‌యూవీ మార్కెట్లో మారుతికి బ్రెజ్జా వాల్యూమ్ డ్రైవర్, బ్రెజ్జా కాకుండా, కార్ల తయారీ సంస్థ ఫ్రాంక్స్, జిమ్నీ, గ్రాండ్ విటారా వంటి ఎస్‌యూవీలను కూడా విక్రయిస్తుంది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) కింద టెస్టింగ్ కోసం మారుతి అందించే మూడు మోడళ్లలో బ్రెజ్జా కూడా ఒకటిగా ఉంది. మిగిలిన రెండు మోడళ్లలో బాలెనో, గ్రాండ్ విటారా ఉన్నాయి.

Read Also : Best SmartPhones in India 2024 : ఈ జనవరి 2024లో భారత్‌లో రూ. 15వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!