×
Ad

Maruti Suzuki Ertiga : ఈ మారుతి కార్ల రేంజే వేరబ్బా.. బెస్ట్ సెల్లింగ్ 7-సీటర్ ఎర్టిగా కేవలం రూ. 2 లక్షలే.. నెలకు EMI ఎంతంటే?

Maruti Suzuki Ertiga : మీరు 7-సీటర్ మారుతి సుజుకి ఎర్టిగా కొనాలని చూస్తున్నారా?ఎర్టిగా ZXI ప్లస్ మాన్యువల్, ఎర్టిగా VXI AT కారు లోన్ ద్వారా కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు.

Maruti Suzuki Ertiga (Image Credit To Original Source)

  • భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే
  • మారుతి సుజుకి ఎర్టిగా మోడల్ 7 సీటర్ కారు ధర ఎంతంటే?
  • రూ. 2 లక్షల డౌన్ పేమెంట్, నెలా రూ. 23,967 ఈఎంఐ

Maruti Suzuki Ertiga : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మారుతి కారు లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మారుతి సుజుకి ఎర్టిగా మోడల్ 7 సీట్లతో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. మీ బడ్జెట్ ధర రేంజ్‌లో కాంపాక్ట్ MPV కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.

ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. లుక్స్, ఫీచర్లు, అద్భుతమైన మైలేజ్ పరంగా ఆకట్టుకునేలా ఉంది. సరసమైన 7-సీట్ల ఎంపీవీ కార్లలో బెస్ట్ కారుగా చెప్పొచ్చు. మారుతి అత్యధికంగా అమ్ముడైన ఎంపీవీ, ఎర్టిగా, 1462cc ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది.

సీఎన్‌జీ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. ఎర్టిగా పెట్రోల్ వేరియంట్‌లు 20.51kmpl వరకు మైలేజీని అందిస్తాయి. లుక్స్ ధర పరంగా అన్నింటిలో ఎర్టిగా భారీగా అమ్మకాలను సాధించింది. ఎర్టిగాలో క్యాబిన్ స్పేస్ కూడా ఉంది. మారుతి సుజుకి ఎర్టిగా ZXI ప్లస్ పెట్రోల్ మాన్యువల్, VXI పెట్రోల్ ఆటోమేటిక్ రెండు కీలక వేరియంట్‌లపై తక్కువ ధరకే లోన్ ద్వారా ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Maruti Suzuki Ertiga (Image Credit To Original Source)

మారుతి ఎర్టిగా VXI ఆటోమేటిక్ ధర ఎంతంటే? :
మారుతి సుజుకి ఎర్టిగా VXI ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.20 లక్షలుగా ఉంది. ఆన్-రోడ్ ధర రూ. 13.28 లక్షలు. ఈ మారుతి ఎర్టిగా బెస్ట్ సెల్లింగ్ వేరియంట్‌కు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే మీరు రూ. 11.28 లక్షల లోన్ తీసుకోవాలి.

Read Also : Union Budget 2026 : బిగ్ రిలీఫ్.. ఇకపై భార్యాభర్తలకు సింగిల్ టాక్స్.. బడ్జెట్‌ 2026లో జాయింట్ టాక్స్ విధానం ప్రకటించే ఛాన్స్.. బెనిఫిట్స్ ఏంటి?

అప్పుడు ఈ లోన్ కాలపరిమితి 5 ఏళ్ల వరకు ఉంటుంది. వడ్డీ రేటు 10శాతంగా పొందవచ్చు. వచ్చే 5 ఏళ్లకు ప్రతి నెలా రూ. 23,967 ఈఎంఐ చెల్లించాలి. అన్ని షరతులతో కలిపి మారుతి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడైన వేరియంట్‌లలో VXI ATకి కొనుగోలు చేస్తే 5 ఏళ్లలో రూ. 3.10 లక్షల వడ్డీని చెల్లించాలి.

మారుతి ఎర్టిగా ZXI ప్లస్ మాన్యువల్ ధర ఎంతంటే? :
మారుతి సుజుకి ZXI ప్లస్ మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.59 లక్షలు. ఆన్-రోడ్ ధర రూ. 13.72 లక్షలు. ఈ ఎర్టిగా వేరియంట్‌కు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో తీసుకుంటే మీకు రూ. 11.72 లక్షల లోన్ లభిస్తుంది.

కారు లోన్ పై వడ్డీ రేటు 10శాతం లోన్ కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. మీరు రాబోయే 60 నెలలకు నెలవారీ ఈఎంఐ రూ.24,902 చెల్లించాలి. మారుతి సుజుకి ఎర్టిగా ZXI ప్లస్ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌కు 5 ఏళ్లలో రూ.3.22 లక్షల వడ్డీ చెల్లించాలి.