Union Budget 2026 : బిగ్ రిలీఫ్.. ఇకపై భార్యాభర్తలకు సింగిల్ టాక్స్.. బడ్జెట్ 2026లో జాయింట్ టాక్స్ విధానం ప్రకటించే ఛాన్స్.. బెనిఫిట్స్ ఏంటి?
Union Budget 2026 : భార్యాభర్తల కోసం కొత్త జాయింట్ టాక్స్ విధానం అమల్లోకి వస్తే.. ఇకపై ఉమ్మడి పన్ను రిటర్నులను ఒక్కటిగా దాఖలు చేయొచ్చు. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఇద్దరు ఆదాయం పొందే కుటుంబాలకు భారీగా డబ్బు సేవ్ అవుతుంది.
Big Tax Relief For Married Couples (Image Credit To Original Source)
- ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక బడ్జెట్ ప్రకటన
- ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలక మార్పులు ఏంటి?
- భార్యాభర్తలు వేరు వేరుగా పన్నులు చెల్లించాల్సిన పనిలేదా?
- ఫ్యామిలీ మొత్తానికి ఒకే పన్ను ఉండబోతుందా?
- జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్‌పై కేంద్రం కసరత్తు
Union Budget 2026 : ఫిబ్రవరి 1నే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. రాబయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ వార్షిక బడ్జెట్ 2026ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించనున్నారు. అయితే, ఈసారి బడ్జెట్ ప్రకటనలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎలాంటి ఉపశమనాలు ఉంటాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ లో కూడా అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
2026 బడ్జెట్ ఎప్పుడంటే? :
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ 2026-27ను ఫిబ్రవరి 1 ఆదివారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు.
ఈసారి బడ్జెట్ లో కూడా అంతే స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు స్వాగతించేలా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని కూడా రూ.12 లక్షలకు పెంచగా.. ఈసారి మరిన్ని ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.
భార్యభర్తలకు ఒకే పన్ను విధానం అమల్లోకి? :
ఇందులో ప్రత్యేకించి కొత్త పన్ను వ్యవస్థ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. భార్యాభర్తలకు ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే.. జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ సిస్టమ్ ప్రతిపాదనపై కూడా కేంద్రం సమీక్షిస్తున్నట్టు సమాచారం.
అదేగానీ జరిగితే పన్ను చరిత్రంలోనే ఇది చారిత్రక మార్పు అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలో ఫ్యామిలీ పరంగా కాకుండా కేవలం వ్యక్తిగతంగానే పన్నులు విధిస్తోంది ప్రభుత్వం. పెళ్లి అయిన టాక్స్ పేయర్లకు ఎలాంటి బెనిఫిట్ లేదనే వాదన వినిపిస్తోంది. అందుకే ఒకే కుటుంబంలో భార్యాభర్తలు వేర్వేరుగా పన్ను చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు.

Big Tax Relief For Married Couples (Image Credit To Original Source)
ఇందులో టాక్స్ శ్లాబులు, డిడక్షన్లు, మినహాయింపుల ప్రయోజనాలను పొందలేని పరిస్థితి. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు సంపాదించినా ఒకరు సంపాదించకపోయినా ప్రాథమిక మినహాయింపు నిరూపయోగం మారిపోతుందని అంటున్నారు. జాయింట్ టాక్స్ విధానం అనేది ఇప్పటికే విదేశాల్లో కొనసాగుతోంది. ప్రత్యేకించి అమెరికా, జర్మనీ దేశాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని అంటున్నారు.
ప్రస్తుత కొత్త పన్ను విధానం కింద రూ.4 లక్షల ఆదాయంపై ప్రాథమిక మినహాయింపు ఉంది. అదే పాత పన్ను విధానం విషయానికి వస్తే.. రూ.2.5 లక్షలుగా ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరూ సంపాదించేవారికి ఈ పన్ను విధానం చాలా ప్రయోజకరంగా మారింది.
కానీ, అలాగే కుటుంబంలో ఒకరే సంపాదించే వారికి మాత్రం ఈ పన్ను విధానం భారంగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే ఈ ఏదైనా కొత్త వ్యవస్థ అమల్లోకి తీసుకువస్తే మధ్యతరగతి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
జాయింట్ ట్యాక్స్ సిస్టమ్ ఏంటంటే? :
జాయింట్ టాక్స్ అంటే.. భార్యాభర్తలకు సంబంధించి ఆదాయం, మినహాయింపులను ఒకే ఐటీఆర్ ద్వారా ఫైలింగ్ చేయొచ్చు. ఇద్దరు వేరుగా సంపాదించినా లేదా ఒకరే సంపాదించినా అది మొత్తం ఫ్యామిలీకి ఒకేసారి పన్ను లెక్కించనున్నారు.
అలా చేయడం వల్ల తక్కువ టాక్స్ చెల్లించే వీలుంటుంది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ కొత్త జాయింట్ టాక్స్ సిస్టమ్ తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భార్యాభర్తలిద్దరిలో కావాలంటే తమ వ్యక్తిగత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు లేదంటే జాయింట్ టాక్స్ విధానాన్ని ఎంచుకోవచ్చు.
వాస్తవానికి, ఇద్దరిలో ఎవరికి రూ.50 లక్షలకు పైగా ఆదాయం ఉంటే మాత్రం సర్‌ఛార్జ్ విధిస్తోంది. అదే జాయింట్ ఫైలింగ్ ద్వారా ఈ లిమిట్ రూ.75 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల భారీ ఆదాయాన్ని పొందే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ప్రయోజనం చేకూరనుంది.
ఒక ఫ్యామిలీలో ఒకరే సంపాదించే వారికి కూడా ఈ జాయింట్ టాక్స్ పన్ను విధానం మరింత భారం తగ్గనుంది. ప్రత్యేకించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలపై పన్ను భారం తగ్గుతుంది. ఫిబ్రవరి 1, 2026న బడ్జెట్‌లో ఈ జాయింట్ టాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే భారీగా పన్ను ఉపశమనం కలగనుంది.
జాయింట్ టాక్స్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి ICAI సూచన :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రభుత్వం భార్యాభర్తల కోసం ఉమ్మడి పన్ను దాఖలు ఎంపికను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ఈ వ్యవస్థ ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ మరియు జర్మనీ వంటి దేశాలలో ఉంది. ఈ దేశాలలో చాలా మంది భార్యాభర్తలు ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది కుటుంబం యొక్క పన్ను బాధ్యతను తగ్గిస్తుంది.
ICAI ప్రతిపాదనలో ఏముంది? :
వ్యాలీడ్ పాన్ కార్డులు ఉన్న భార్యాభర్తలు ఉమ్మడి రిటర్న్‌లను దాఖలు చేసే అవకాశం ఉండాలని ఐసీఏఐ ప్రతిపాదనలో పేర్కొంది. ఇది తప్పనిసరి కాకూడదు. ఇది కేవలం ఒక ఎంపిక మాత్రమేనని సూచించింది. అంటే.. జీవిత భాగస్వామి విడివిడిగా రిటర్న్‌లను దాఖలు చేయాలనుకుంటే.. వారు అలా చేసుకోవచ్చు అనమాట. ఉమ్మడిగా ఐటీఆర్ దాఖలు చేయడంలో బెనిఫిట్స్ పొందాలనుకునే భార్యాభర్తలకు ఈ ఆప్షన్ ప్రయోజనకరంగా ఉంటుంది.
