8th Pay Commission Salary Hike : ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. 2026 బడ్జెట్ తర్వాతే జీతాల పెంపు? 8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే?
8th Pay Commission Salary Hike : 8వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. జనవరి 1, 2026న జీత సవరణ ప్రకటన లేదు. 8వ వేతన సంఘం అమలు షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదని స్పష్టం అవుతోంది.
8th Pay Commission Salary Hike (Image Credit To Original Source)
- 8వ వేతన సంఘం అమలు మరింత ఆలస్యం
- 2026 బడ్జెట్ తర్వాతే జీతాల పెంపుదల ఉండే అవకాశం
- ఉద్యోగులు, పెన్షనర్లు వేతనాల పెంపు కోసం ఎదురుచూపులు
- కమిషన్ రిపోర్టు విడుదలకు 15 నెలల నుంచి 18 నెలలు పట్టవచ్చు
8th Pay Commission Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. 8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులు జనవరి 2026లో అమలు అవుతాయని భావించారు. కానీ, కమిషన్ నివేదిక 15 నుంచి 18 నెలల్లో మాత్రమే సిద్ధంగా ఉంటుందని ఇప్పుడు స్పష్టమైంది. ఈ ఆలస్యం కారణంగా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 8వ వేతన సంఘానికి సంబంధించి జీతాల పెంపుదల కోసం ఉద్యోగులు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి రావొచ్చు.
ఎందుకంటే.. జనవరి 2026 గడిచినప్పటికీ వేతన సవరణ ప్రకటన ఇంకా రాలేదు. 8వ వేతన సంఘం అమలు షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. రేటింగ్ ఏజెన్సీ ICRA రిపోర్టు ప్రకారం.. ఈ ఆలస్యం రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగులపైనే కాకుండా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కనిపిస్తోంది.
8వ వేతన సంఘం వాయిదా ఎందుకంటే? :
సాధారణంగా, ప్రతి 10 ఏళ్లకు ఒక కొత్త వేతన సంఘం అమలు అవుతుంది. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుంచి అమలు వస్తుందని భావించారు. అయితే, ICRA ప్రకారం.. కమిషన్ రిపోర్టు విడుదలకు 15 నెలల నుంచి 18 నెలలు పట్టవచ్చు. తత్ఫలితంగా, సమీప భవిష్యత్తులో జీతాల పెంపు చాలా తక్కువగా కనిపిస్తోంది.
8వ వేతన సంఘంలో జాప్యం, బడ్జెట్‌పై ప్రభావం :
జనవరి 1, 2026ను 8వ కమిషన్ అమలు తేదీగా పరిగణించారు. అయితే, కమిషన్ రిపోర్టు ఇంకా సిద్ధంగా లేకపోవడం వేతన పెంపు వెంటనే అమలు కాదు. వేతన కమిషన్ అమలు చేయబడినప్పుడల్లా అది జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. దాంతో ప్రభుత్వం 15 నెలలు లేదా అంతకంటే ఎక్కువ జీతం, పెన్షన్ బకాయిలను కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అందుకే FY2028 బడ్జెట్‌పై దాని ప్రభావం భారీగా ఉంటుంది.
జీతం, పెన్షన్ ఖర్చులలో 40 శాతం నుంచి 50 శాతం పెంపు? :
2028 ఆర్థిక సంవత్సరంలో జీతం ఖర్చు 40 శాతం నుంచి 50శాతం పెరిగే అవకాశం ఉందని ICRA హెచ్చరించింది. అదేజరిగితే ప్రభుత్వ ఆర్థిక సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేసే సామర్థ్యంపై ఎఫెక్ట్ పడుతుంది.
7వ వేతన సంఘం సమయంలో 6 నెలల అర్హత ఉన్నప్పటికీ, జీతం ఖర్చు ఒక ఏడాదిలో 20శాతం కన్నా ఎక్కువ పెరిగింది. 6వ వేతన సంఘం నుంచి జాప్యాలు 2.5 సంవత్సరాలకు పైగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్‌పై రెండేళ్లపాటు ఒత్తిడిని కలిగించింది.
8వ వేతన సంఘం ఏర్పడిన తర్వాత, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పడు ఉద్యోగుల్లో అందరికి 8వ వేతన సంఘంలో ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం అనుమతి తర్వాత గ్రూప్ A, B, C, D ఉద్యోగుల బేసిక్ పే ఎంత పెరగనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి? :
8వ వేతన సంఘంలో 2.15, 2.57 లేదా 2.86 వంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లపై నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15గా ఉంటే.. అంచనా జీతం ఎంత? :
8వ వేతన కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15 అయితే, అంచనా సవరించిన జీతాల పెంపు ఇలా ఉండవచ్చు.
- లెవల్ 1 (ఎంట్రీ లెవల్, గ్రూప్ డి) : ప్రస్తుత బేసిక్ శాలరీ రూ. 18వేలు.. సవరించిన వేతనం రూ. 38,700.. పెంపు రూ. 20,700
- లెవల్ 10 (ఎంట్రీ లెవల్, గ్రూప్ ఎ) : ప్రస్తుత బేసిక్ శాలరీ రూ. 56,100.. సవరించిన వేతనం (రూ. 1,20,615).. పెంపు = రూ. 64,515
- లెవల్ 18 (గ్రూప్ A సీనియర్-మోస్ట్ లెవల్) : ప్రస్తుత బేసిక్ శాలరీ రూ. 2,50,000.. సవరించిన బేసిక్ శాలరీ (రూ. 5,37,500), పెంపు = రూ. 2,87,500

8th Pay Commission Salary Hike (Image Credit To Original Source)
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అయితే జీతం పరిధి ఎంత?:
8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అయితే, జీతం ఈ కింది విధంగా పెరగొచ్చు.
- లెవల్ 1 (ఎంట్రీ లెవల్, గ్రూప్ డి) : ప్రస్తుత బేసిక్ పే రూ. 18,000, సవరించిన బేసిక్ పే రూ. 46,260, పెంపు : రూ. 28,260
- లెవల్ 10 (ఎంట్రీ లెవల్, గ్రూప్ ఎ) : ప్రస్తుత బేసిక్ పే రూ. 56,100, సవరించిన బేసిక్ పే రూ. 1,44,177, పెంపు : రూ. 88,077
- లెవల్ 18 (సీనియర్-మోస్ట్ గ్రూప్ ఎ) : ప్రస్తుత బేసిక్ పే రూ. 2,50,000, సవరించిన బేసిక్ పే రూ. 6,42,500, పెంపు : రూ. 3,92,500
8వ CPC ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే బేసిక్ శాలరీ రేంజ్ ఎంత? :
8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే బేసిక్ శాలరీ రేంజ్ పరిధి ఈ కింది విధంగా ఉండొచ్చు.
- లెవల్ 1 (ఎంట్రీ లెవల్, గ్రూప్ డి) : రూ. 18,000, సవరించిన బేసిక్ పే రూ. 51,480, పెంపు = రూ. 33,480
- లెవల్ 10 (ఎంట్రీ లెవల్, గ్రూప్ ఎ ఆఫీసర్) : ప్రస్తుత బేసిక్ పే రూ. 56,100, సవరించిన బేసిక్ పే రూ. 1,60,446, పెంపు రూ. 1,04,346
- లెవల్ 18 (గ్రూప్ ఎ హైలెవల్ ): రూ. 2,50,000, సవరించిన పే రూ. 7,15,000 ), పెంపు = రూ. 4,65,000
