Toyota Taisor Discount : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ టయోటా టైజర్‌పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 49,200 వరకు తగ్గింపు..

Toyota Taisor Discount : టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ భారీ తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లకు రూ. 49,200 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ SUVపై కంపెనీ 5 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.

Toyota Taisor Discount : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ టయోటా టైజర్‌పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 49,200 వరకు తగ్గింపు..

Toyota Taisor Discount

Updated On : December 14, 2025 / 6:31 PM IST

Toyota Taisor Discount : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మీరు మిడ్-సైజ్ SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. వాస్తవానికి, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ప్రస్తుతం ఇయర్ ఎండ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ద్వారా కస్టమర్లు రూ.49,200 బెనిఫిట్స్ పొందవచ్చు.

దాంతో పాటు, కంపెనీ ఈ SUV కారుపై 5 ఏళ్ల వారంటీ, ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ లాయల్టీని కూడా అందిస్తోంది. మారుతి ఫ్రాంక్స్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7,21,200 ఉంటుంది. ఇప్పుడు SUV ఫీచర్లు, ఇంజిన్ వివరాలపై ఓసారి లుక్కేయండి..

అర్బన్ క్రూయిజర్ టేజర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
టయోటా టైసర్ మారుతి ఫ్రాంక్స్ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. కొలతలు ఫ్రాంక్స్‌ మాదిరిగా ఉంటాయి. అయితే, కంపెనీ ప్రత్యేకమైన గుర్తింపు కోసం డిజైన్‌ను పూర్తిగా రీడిజైన్ చేసింది. కూపే-స్టయిల్ సబ్‌కాంపాక్ట్ SUVలో బ్లాక్ కలర్‌లో కొత్త హానీ మెష్ గ్రిల్ ఉంది. మధ్యలో టయోటా లోగో ఉంది.

కొత్త ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్ మరింత మోడ్రాన్ రూపాన్ని ఇస్తాయి. బ్యాక్ సైడ్ కూడా మార్పులు కనిపిస్తాయి. ఈ SUVలో ట్రంక్ పైన లైట్ బార్ ద్వారా లింక్ రిఫ్రెష్ ఎల్ఈడీ టెయిల్ లైట్‌లు ఉన్నాయి. కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ మొత్తం ప్రొఫైల్‌కు స్పోర్టియర్ మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.

Read Also : Maruti Suzuki Victoris : మారుతి సుజుకి విక్టోరిస్ సంచలనం.. అమ్మకాల్లో దుమ్ములేపింది.. గ్రాండ్ విటారాను దాటేసింది..!

ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే? :
ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. టయోటా టైసర్ క్యాబిన్ ఫ్రాంక్స్‌ని పోలి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో MID యూనిట్‌తో కూడిన ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.

ఈ క్యాబిన్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ పోలి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెంటర్ MID యూనిట్‌తో కూడిన ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. క్యాబిన్ కొత్త డ్యూయల్-టోన్ ట్రీట్‌మెంట్‌ కలిగి ఉంది. అయితే, దాదాపు అన్ని ఇతర ఫీచర్లు కలిగి ఉంటుంది.

అదనంగా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, DRLతో ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు మొదలైన ఫీచర్లతో వస్తుంది. ఈ సబ్-కాంపాక్ట్ SUVలో 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, స్టాప్ బ్యాక్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ మైలేజ్ :
టయోటా టైజార్ మారుతి బూస్టర్‌జెట్ K-సిరీస్ ఇంజిన్‌ల ఆధారంగా 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 1.2-లీటర్ CNG ఆప్షన్లలో వస్తుంది.

మాన్యువల్ ఆటోమేటిక్ (AMT/టార్క్ కన్వర్టర్) ట్రాన్స్‌మిషన్‌లతో లభిస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 1.2 ఇంజిన్ 89bhp, 113Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, టర్బోచార్జ్డ్ యూనిట్ 99bhp, 148Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.