Mercedes-AMG GT 63 S E Performance launched in India at Rs 3.3 crore, Check Full Details
Mercedes-AMG GT 63 Launch : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మెర్సిడెస్ నుంచి (Mercedes-AMG) GT 63 SE పర్ఫార్మెన్స్ లాంచ్ చేసింది. అడ్వాన్సడ్ టెక్నాలజీతో వచ్చిన ఈ కారును రూ. 3.30 కోట్లకు (ఎక్స్-షోరూమ్) ధరకు రిలీజ్ చేసింది. హై-పర్ఫార్మెన్స్ అందించే ఫోర్-డోర్ కూపే అఫాల్టర్‌బాచ్ నుంచి వచ్చిన అత్యంత పవర్‌ఫుల్ కారుగా చెప్పవచ్చు. ఈ కారు పవర్‌ఫుల్ V8 సౌజన్యంతో వచ్చింది. దీనికి ఎలక్ట్రిక్ మోటార్, హై పర్ఫార్మెన్స్ బ్యాటరీ సపోర్టు ఉంది. ఫార్ములా 1 లెజెండ్ లూయిస్ హామిల్టన్ ద్వారా కారును ఆర్డర్ చేసిన వినియోగదారులకు ఈ కారును అందించారు. ఇంతకీ ఈ మెర్సిడెస్ కారు ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మెర్సిడెస్ (Mercedes-Benz) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & CEO సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘AMG GT 63 E పర్ఫార్మెన్స్ కారు.. గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి వచ్చిన టాప్-ఎండ్ కార్లలో ఇదొకటి. ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కారు పూర్తిగా AMG F1-ప్రేరేపిత కొత్త టెక్నాలజీ లేబుల్ E పర్ఫార్మెన్స్ అందిస్తుంది. డ్రైవింగ్ డైనమిక్స్ ఫీచర్లతో Affalterbachలోని ఇంజనీర్లచే పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. ఈ కారుతో AMG కొత్త లక్ష్యాలను సాధించనుంది’ అని ఆయన చెప్పారు.
Mercedes-AMG GT 63 S E Performance launched in India at Rs 3.3 crore
మెర్సిడెస్-AMG GT 63 SE పర్ఫార్మెన్స్ కారు 4.0-లీటర్ V8 బిటుర్బో ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 620 843bhp సిస్టమ్ అవుట్‌పుట్, 1,470 Nm కన్నా ఎక్కువ గరిష్ట సిస్టమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ సిస్టమ్ అంటే.. ఈ 2.4-టన్నుల కారు కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 100kmph వరకు, 316kmph గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. 9-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను ఉపయోగిస్తుంది. మెర్సిడెస్-AMG పెట్రోనాస్ F1 బృందం ఫార్ములా 1 హైబ్రిడ్ రేసింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది. అల్ట్రా-లైట్ లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి ఎలక్ట్రిక్ మోటార్ శక్తిని అందిస్తుంది.
ఈ కారు (4MATIC+ AWD) సిస్టమ్‌తో వస్తుంది. మోటార్ ముందు చక్రాలకు కూడా పవర్ అందించగలదు. ఎలక్ట్రిక్ డ్రైవ్ మోడ్‌తో సహా 7 డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. దాంతో కారు కేవలం విద్యుత్ శక్తితో 13 కిమీల పరిధి వరకు నడుస్తుంది. చాలా ఎక్కువ కాదు.. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ శక్తిని మోటారుకు అందించేలా బ్యాటరీని అభివృద్ధి చేశారు. రూ.3.30 కోట్ల ధరతో Mercedes-AMG GT 63 SE పర్ఫార్మెన్స్ కారు, మెర్సిడెస్-AMG GT 63 Sతో పోలిస్తే చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు. ఇటీవల, భారత మార్కెట్లో Mercedes-AMG E 53 క్యాబ్రియోలెట్‌ను కూడా లాంచ్ చేసింది.