Meta India head Ajit Mohan resigns, set to join another social media company
Ajit Mohan Resign : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta India)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇండియా హెడ్ (Meta India Head) అజిత్ మోహన్ (Ajit Mohan) ఒక్కసారిగా షాకిచ్చారు. మెటా కంపెనీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు అజిత్ మోహన్ ప్రకటించారు. తన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా మెటా తెలిపింది. ఈ మేరకు కంపెనీ ధ్రువీకరించింది. అజిత్ మోహన్ మెటా కంపెనీకి రిజైన్ చేస్తున్నానని అందరికి షాకిచ్చారు. ఇంతకీ అజిత్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో క్లారిటీ లేదు.
మరో విషయం ఏంటంటే.. ఫేస్‌బుక్ పోటీదారు అయిన మరో సోషల్ మీడియా కంపెనీ స్నాప్ (Snap)లో అజిత్ మోహన్ జాయిన్ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మెటాలో జనవరి 2019లో అజిత్ మోహన్ చేరారు. అంతేకాదు.. మెటా భారతీయ వ్యాపారాలకు వైస్ ప్రెసిడెంట్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన ఉంటున్నారు. ఇప్పటివరకూ మెటా ఇండియా మోహన్ ఆధ్వర్యంలో ఫేస్‌బుక్ సొంత యాప్స్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు భారత్‌లో 20 కోట్లకు పైగా వినియోగదారులు చేరారు. దాంతో ఒక్కసారిగా భారత్‌లో మెటా పెట్టుబడులు భారీగా పెరిగాయి.
అజిత్ మోహన్ రాజీనామా చేయడంపై మెటా కూడా స్పందించింది. మెటా నుంచి మోహన్ తప్పుకున్నారని స్పష్టం చేసింది. మోహన్ మరో కంపెనీలో అవకాశం రావడంతో మెటా ఇండియా హెడ్ పదవి నుంచి తప్పుకున్నారని మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గత నాలుగేళ్లుగా అజిత్ మోహన్ మెటా భారతీయ వ్యాపారాల్లో కీలక పాత్ర పోషించారు. అజిత్ మోహన్ నాయకత్వం విషయంలో కృతజ్ఞతతో ఉంటామన్నారు. మోహన్ అందించిన సహకారం మరవరానిదిగా కంపెనీ పేర్కొంది.
Meta India head Ajit Mohan resigns, set to join another social media company
అజిత్ మోహన్ భవిష్యత్ కార్యకలాపాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని నికోలా తెలిపారు. అజిత్ మోహన్ ఫేస్‌బుక్‌లో జాయిన్ కావడానికి ముందు.. స్టార్ ఇండియా (డిస్నీ స్టార్) వీడియో స్ట్రీమింగ్ సర్వీసు హాట్‌స్టార్ (HotStar)కి నాలుగేళ్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అజిత్ మోహన్ కన్న ముందే ఫేస్‌బుక్ ఇండియాకి అధినేతగా ఉమాంగ్ భేడి ఉన్నారు. అక్టోబర్ 2017లో ఉమాంగ్ ఫేస్‌బుక్ నుంచి తప్పుకున్నారు. దాంతో మోహన్ అజిత్ మెటా ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఫేస్‌బుక్ మెటాగా రీబ్రాండ్ అయి ఏడాది పూర్తి అయింది. ఆ తర్వాత ఫేస్‌బుక్ బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంపెనీ మార్కెట్ వాల్యూ పతాళానికి పడిపోయింది. 677 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాప్‌ను మెటా కోల్పోయింది. సుమారు 700 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. తద్వారా ప్రపంచంలోనే టాప్ 20 అతిపెద్ద కంపెనీల జాబితా నుంచి మెటా తన చోటు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మెటా ఇండియా హెడ్ బాధ్యతల నుంచి తప్పుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. మెటా కంపెనీ సంపద తగ్గిపోయిన నేపథ్యంలో మెటా ఇండియా అధినేత అజిత్ మోహన్ రాజీనామా చేయడం ఫేస్ బుక్‌కు గట్టి షాక్ తగిలినట్టు అయింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Facebook-Meta : మెటాకు భారీ షాక్.. కంపెనీ చరిత్రలోనే ఫస్ట్ టైం… మిలియన్ల మంది యూజర్లు లాస్..!