MG Comet EV launch in India on April 26, get price details here
MG Comet EV Launch : కొత్త కారు కొంటున్నారా? అయితే ఆగండి.. ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ (MG Comet) నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. అధికారికంగా ఏప్రిల్ 26న భారత మార్కెట్లో MG కామెట్ EV లాంచ్ కానుంది. ఈ కారు డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ, కొలతలు పరంగా చూస్తే కారు చాలా చిన్నది.
భారత మార్కెట్లో MG కామెట్ EV ధర రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. SAIC-GM-వులింగ్ గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (GSEV) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా.. MG కామెట్ EV కారు.. Tata Tiago.ev, Citroen e-C3 వంటి కార్లకు పోటీగా వస్తోంది. MG కామెట్ EV మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్‌ల గురించి వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయింది.
మూడు-డోర్ల ఎలక్ట్రిక్ కారు 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తోంది. 42PS/110Nm ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. 3.3kW ఛార్జర్‌తో బ్యాటరీ ఛార్జింగ్ సమయం 0-100శాతంకి 7 గంటలు వరకు వస్తుంది. 10-80శాతంకి 5 గంటలుగా అంచనా. MG కామెట్ EV శ్రేణి ఒకసారి ఫుల్ ఛార్జింగ్‌తో 230 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. MG కామెట్ EV కారు టాటా నానో మాదిరిగానే చిన్నదిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2,974mm పొడవు, 1,631mm ఎత్తు, 1,505mm వెడల్పు, 2,010mm వీల్‌బేస్ కలిగి ఉంది.
MG Comet EV launch in India on April 26, get price details here
ఈ MG కామెట్ EVలో ప్రత్యేకంగా రూపొందించిన LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 12-అంగుళాల వీల్స్ ఉన్నాయి. క్యాబిన్ డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు సులభంగా కూర్చొవచ్చు. 10.25-అంగుళాల ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple iPod-ప్రేరేపిత ట్విన్-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి బెల్స్, విజిల్ ఫీచర్లు ఈవీ కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.