Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్లు.. ఈ రెండు ప్లాన్లతో భారీ డేటా, మరెన్నో OTT బెనిఫిట్స్..!

Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) కస్టమర్లకు అలర్ట్.. రెండు సరికొత్త ప్లాన్లు వచ్చేశాయి. ఈ రెండు ప్లాన్లలో భారీ డేటాతో పాటు మరెన్నో (OTT) బెనిఫిట్స్ పొందవచ్చు.

Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్లు.. ఈ రెండు ప్లాన్లతో భారీ డేటా, మరెన్నో OTT బెనిఫిట్స్..!

Vodafone Idea launches new plans worth at Rs 368 and Rs 369 with data and OTT benefits

Vodafone Idea Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. Vi కస్టమర్ల కోసం రూ. 368, రూ.369 అనే రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లతో ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇప్పటికే దేశంలో ఇతర టెలికం పోటీదారులైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) 5G సర్వీసులను ప్రారంభించగా.. వొడాఫోన్ ఐడియా ఇప్పటికీ 5G సర్వీసులను అందించలేకపోయింది. జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే భారతీయ ముఖ్యమైన నగరాల్లో తమ 5G నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

టెలికాం కంపెనీ ఇంకా తన 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించలేదు. ఇటీవలి ప్రకటనలో Vi టెలికం కంపెనీ త్వరలో 5Gని తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. కానీ, ఎప్పటినుంచి 5G సర్వీసులను అందించనుందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. కొత్త మొబైల్ ప్లాన్‌లతో Vi యాక్టివ్ కస్టమర్ బేస్‌ను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Read Also : Vodafone-idea 5G Rollout : ఎట్టకేలకు భారత్‌లో వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు.. రావడం కొంచెం లేటైనా.. రావడం మాత్రం పక్కా..!

ఈ ప్రయత్నంలో భాగంగానే (Vi) రూ 368, రూ 369 ధరలతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. Vi నుంచి ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ కాల్‌లు, రోజుకు 100 SMSలతో పాటు మరిన్ని ఆఫర్లను అందించనుంది. Vi యూజర్ల కోసం రూ. 129, రూ. 298 రీఛార్జ్ ప్యాక్‌లలో కొన్ని మార్పులను చేసింది. ఆయా ప్లాన్లలో అదనపు బెనిఫిట్స్ చేర్చింది.

Vodafone Idea launches new plans worth at Rs 368 and Rs 369 with data and OTT benefits

Vodafone Idea Plans worth at Rs 368 and Rs 369 with data and OTT benefits

Vi కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలివే :

Vi రూ 368 ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా నుంచి రూ. 368 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2GB డేటాతో 30 రోజుల పాటు మొత్తం 60GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్‌లు, రోజుకు 100 SMSలతో పాటు, Vi యూజర్లు SunNxt యాప్, Binge All Night, వారాంతపు డేటా పొందవచ్చు. Vi సినిమాలు, TV సబ్‌స్క్రిప్షన్, 2GB డేటా బ్యాకప్‌కు కూడా యాక్సెస్‌ పొందవచ్చు. బింగే ఆల్ నైట్ ఆఫర్ అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు 121249కి డయల్ చేయవచ్చు.

Vi రూ 369 ప్లాన్ :
Vodafone Idea రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, Binge All Night, వారాంతంలో డేటా, SonyLiv, Vi సినిమాలు, టీవీ యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు. 2GB వరకు డేటాతో సహా 30 రోజుల బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రతి నెల బ్యాకప్ కూడా అందిస్తుంది. రూ. 368, రూ. 369 ప్రీపెయిడ్ ప్యాక్‌లలో SonyLiv, SunNxt సబ్‌స్క్రిప్షన్‌లను చేర్చింది.
ముఖ్యంగా, కొత్తగా యాడ్ చేసిన ప్లాన్‌ల ధరలో కేవలం రూ. 1 తేడా మాత్రమే ఉంది.

రూ. 368, రూ. 369 ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మొదటిది SunNXT యాప్‌కి యాక్సెస్‌ను అందిస్తుంది. రెండో ప్లాన్ ద్వారా Sony LIV యాప్‌కి యాక్సెస్‌ పొందవచ్చు. ఈ నెల ప్రారంభంలో Vi బండిల్ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. రూ.181 ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ను కూడా ప్రారంభించింది. Vi కొత్త డేటా వోచర్ 30 రోజుల పాటు 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. 1GB లిమిట్ దాటిన తర్వాత ప్రతి రోజు డేటా రీసెట్ అవుతుంది. మెయిన్ రీఛార్జ్ ప్లాన్ నుంచి యూజర్ల రోజువారీ డేటాను వినియోగించుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S22 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S22పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!