MG Gloster Blackstorm Launched in India, price starts at Rs 40.30 lakh
MG Gloster Blackstorm Launched in India : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) నుంచి సరికొత్త గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ (Gloster Blackstorm) ఫ్లాగ్‌షిప్ SUV కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ SUV కారు ధర రూ. 40.30 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఎంజీ ఫ్లాగ్‌షిప్ SUV కార్లలో ఆస్టర్, హెక్టర్, ZS EV వంటి SUVలను కూడా కంపెనీ విక్రయిస్తుంది.
ఎంజీ మోటార్ ఇండియా MG గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్‌ను రూ. 40.30 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఎక్ట్సీరియర్‌లో రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. SUV లెవల్-1 ADAS, బోర్గ్‌వార్నర్ ట్రాన్స్‌ఫర్ కేసు 4WDని కలిగి ఉంది.
MG గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ 2WD, 4WD, గ్లోస్టర్, ఇంటర్నెట్ ఇన్‌సైడ్‌తో సహా మెటల్ బ్లాక్, మెటల్ యాష్ కలర్ ఐకాన్‌లను కలిగి ఉంది. డార్క్ థీమ్ రూఫ్ రెయిల్‌లు, స్మోక్డ్-బ్లాక్ టైల్‌లైట్, విండో సరౌండ్, ఫెండర్, ఫాగ్ గార్నిష్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్-థీమ్ క్యాబిన్‌లో స్టీరింగ్ వీల్‌పై రెడ్ కలర్ అసెంట్స్ కూడా ఉన్నాయి. రెడ్ కలర్ స్టిచెస్ కలిగిన లెథెరెట్ సీటు అప్హోల్స్టరీ ఉంది.
Read Also : MG ZS EV Car Volumes : 2020 నుంచి 10వేల యూనిట్లకుపైగా వాల్యూమ్‌లను నమోదు చేసిన ఎంజీ ZS ఎలక్ట్రిక్ కారు..
ప్రామాణిక MG గ్లోస్టర్ మాదిరిగా.. బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0-లీటర్ టర్బో డీజిల్ (161PS/373Nm), 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ (215PS/478Nm), రెండు ఇంజన్లు 8-స్పీడ్ ATతో వచ్చాయి. 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ మోడల్ ఆప్షన్‌తో ఆన్-డిమాండ్ 4WDని కలిగి ఉంది. ఈ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ SUV కారు మొత్తం Snow, Mud, Sand, Eco, Sport, Normal, Rock అనే ఏడు మోడ్‌లతో కూడిన ఆల్-టెర్రైన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ కొన్ని స్థాయి-1 ADAS ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
MG Gloster Blackstorm Launched in India, price starts at Rs 40.30 lakh
* అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
* ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
* ఆటోమేటిక్ పార్కింగ్ సహాయం
* ఫార్వర్డ్ కొలిజిన్ వార్నింగ్
* లేన్ డిపరేచర్ వార్నింగ్
* బ్లైండ్ స్పాట్ డిటెక్షన్
* డోర్ ఓపెన్ వార్నింగ్
* రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్
* లేన్ చేంజ్ అసెస్ట్
* డ్రైవర్ ఫెటీగ్ రిమైండర్ సిస్టమ్
ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి (ఎక్స్-షోరూమ్).
* బ్లాక్‌స్టార్మ్ 6-సీటర్ 2WD : రూ. 40.30 లక్షలు
* బ్లాక్‌స్టార్మ్ 7-సీటర్ 2WD : రూ. 40.30 లక్షలు
* బ్లాక్‌స్టార్మ్ 6-సీటర్ 4WD : రూ. 43.08 లక్షలు
* బ్లాక్‌స్టార్మ్ 7-సీటర్ 4WD : రూ. 43.08 లక్షలు
MG My MG షీల్డ్ యాజమాన్య ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో కొత్త గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్‌తో 180 అమ్మకాల తర్వాత సర్వీసు ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా, కస్టమర్‌లు ప్రామాణిక 3+3+3 ప్యాకేజీ నుంచి బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ కిలోమీటర్లు, మూడు ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీస్‌లతో మూడు ఏళ్ల వారంటీ అందిస్తుంది.