MG Motor India begins annual service camp
MG Motor India begins annual service camp : 99ఏళ్ల చరిత్ర గలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తమ కస్టమర్ల కోసం వార్షిక సర్వీస్ క్యాంపు (annual service camp) నిర్వహణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ సర్వీస్ క్యాంప్ భారత్‌లోని అధీకృత ఎంజీ సర్వీస్ సెంటర్లలో జూలై 18 వరకు కొనసాగుతుంది.
ఈ సర్వీస్ క్యాంప్ సమయంలో ఎంజీ కస్టమర్‌లు అనేక ఆఫర్‌లను పొందవచ్చు. అందులో ఉచిత 25 పాయింట్ల వెహికల్ హెల్త్ చెకప్, కాంప్లిమెంటరీ కార్ వాష్, బ్యాటరీ హెల్త్ చెక్, AC సర్వీసుపై 25శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. విలువ ఆధారిత సేవలపై 20శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు. ఇంజిన్ ఆయిల్‌పై ఆకర్షణీయమైన తగ్గింపుతో పాటు టైర్ రీప్లేస్‌మెంట్‌పై ప్రత్యేక ఆఫర్ అందిస్తుంది.
జూలై 18 వరకు కొనసాగే ఈ వార్షిక సేవ శిబిరంలో అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. దీనిపై ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్, ఆఫ్టర్ సేల్స్, రాజేష్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ఎంజీ మోటార్ ఇండియాలో చేసే ప్రతి పనిలోనూ ఎంజీ ఓనర్లను కేంద్ర స్థానంలో ఉంచుతాం. శిక్షణ పొందిన నిపుణులు క్యాంప్ సమయంలో అందించే సేవలు ఎంజీ కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయని విశ్వసిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
MG Motor India begins annual service camp
ఎంజీ కస్టమర్లకు సర్వశ్రేష్టమైన అమ్మకాలను, విక్రయానంతర అనుభవాన్ని అందించడానికి ఎంజి కట్టుబడి ఉంది. జె.డి. పవర్ 2021లో, 2022 భారత అమ్మకాల సంతృప్తి సర్వే (S.S.I)లో నంబర్ వన్ (1) ర్యాంకును, ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ అధ్యయనం (CNI) లో నంబర్ వన్ (1) ర్యాంకును పొందింది.