MG Motor India : జూన్‌లో 14శాతం పెరిగిన ఎంజీ మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాలు.. 5,125 యూనిట్లు!

MG Motor India : ఎంజీ మోటార్ ఇండియా జూన్‌లో అద్భుతమైన అమ్మకాలను సాధించింది. దాదాపు 14 శాతానికి పైగా రిటైల్ అమ్మకాలతో 5,125 యూనిట్లను విక్రయించింది.

MG Motor India retail sales up 14 percent in June, sells 5,125 units

MG Motor India Retail Sales : ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) జూన్ 2023లో గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే… 14 శాతం రిటైల్ అమ్మకాలు పెరిగినట్లు నివేదించింది. ఆటో తయారీదారు గత నెలలో 5,125 యూనిట్ల కార్లను విక్రయించింది. జూన్ 2022లో కంపెనీ 4,504 యూనిట్ల రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది.

నివేదిక ప్రకారం.. బిపార్జోయ్ తుఫాను నేపథ్యంలో సరఫరాలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే, రుతుపవనాల కారణంగా వినియోగదారుల డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. అయితే, త్వరలో పండుగ సీజన్‌ మొదలుకానుంది. 2023 రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 10,519 యూనిట్ల నుంచి 14,682 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 40 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Read Also : WhatsApp Beta Users : వాట్సాప్ యూజర్లు.. ఇకపై హై-క్వాలిటీ వీడియోలను కూడా పంపుకోవచ్చు..!

ఈ వారం ప్రారంభంలో ఎంజీ మోటార్ ఇండియా కొత్తగా లాంచ్ చేసిన MG కామెట్ EV కారులోని కొత్త ఫీచర్లను అందించేందుకు జియో ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఎంజీ కామెట్ ఈవీ, జియో డిజిటల్ ఆస్తుల ద్వారా ఆధారితమైన హింగ్లీష్ వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్‌ను అందిస్తుంది. సిస్టమ్ మ్యూజిక్ యాప్‌లు, పేమెంట్ యాప్‌లు, కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్, హార్డ్‌వేర్‌తో‌ వస్తుంది. వాహన తయారీదారులు ఎంజీకామెట్ ఈవీని ‘హలో జియో’ వాయిస్ అసిస్టెంట్‌తో వచ్చింది.

MG Motor India retail sales up 14 percent in June, sells 5,125 units

భారతీయ యూజర్ విభిన్న ప్రాంతీయ మాండలికాలు, టోనాలిటీని ట్రైనింగ్ పొందింది. అసిస్టెంట్ డైలాగ్‌లకు సపోర్టుతో వస్తుంది. క్రికెట్, వాతావరణం, వార్తలు, జాతకం మరిన్నింటి గురించి సమాచారాన్ని అందించగలదు. అదనంగా, MG కామెట్ EV యజమానులు ACని ఆఫ్ చేయడానికి/ఆన్ చేయడానికి, పాటలను ప్లే చేయడానికి,క్రికెట్ స్కోర్ కోసం అసిస్టెంట్‌ని ఉపయోగించవచ్చు.

ఎంజీ మోటార్ ఇండియా, కామెట్ ఈవీ తయారీ ప్రక్రియలో (Jio eSIM)తో కూడా వస్తుంది. వాహన భద్రతను మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రిలయన్స్ జియో eSIM వాహనాన్ని గుర్తించగలదు. వాహనం రన్నింగ్ సమయంలో కమ్యూనికేషన్‌లను ఎన్‌క్రిప్ట్ చేయగలదు. ఎంజీ కామెట్ ఈవీ అనేది టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 వంటి వాటితో పోటీపడే ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అని చెప్పవచ్చు.

ఈ కారు పొడవు 3 మీటర్ల కన్నా తక్కువ, ఎత్తు 1,640mm, వెడల్పు 1,505mm. 12-అంగుళాల స్టీల్ వీల్స్‌పై రన్ అవుతుంది. కామెట్ ఈవీ ప్రధాన భాగం 17.3kWh బ్యాటరీ ప్యాక్, 230కి.మీ పరిధిని సాధించగలదని ఎంజీ కంపెనీ పేర్కొంది. వాహనం ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది.

Read Also : Tecno Camon 20 Premier 5G : జూలై 7న టెక్నో Camon 20 ప్రీమియర్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?