Tecno Camon 20 Premier 5G : జూలై 7న టెక్నో Camon 20 ప్రీమియర్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Tecno Camon 20 Premier 5G : టెక్నో Camon 20 ప్రీమియర్ 5G ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 7న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Tecno Camon 20 Premier 5G : జూలై 7న టెక్నో Camon 20 ప్రీమియర్ 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Tecno Camon 20 Premier 5G India Launch Date Set For July 7

Updated On : July 1, 2023 / 8:24 PM IST

Tecno Camon 20 Premier 5G : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ టెక్నో నుంచి (Camon) 20 ప్రీమియర్ 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 7న భారత మార్కెట్లో (Tecno Camon 20) ప్రీమియర్ 5G లాంచ్ కానుంది. ఇతర Tecno Camon 20 సిరీస్ మోడల్‌లతో పాటు ఈ ఏడాది మేలో ఫోన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ లైనప్‌లో బేస్ Tecno Camon 20, Tecno Camon 20 Pro 5G మోడల్ కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో హ్యాండ్‌సెట్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు, ధర ఇంకా వెల్లడి కాలేదు. బేస్, ప్రో మోడల్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. రాబోయే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 14,999గా ఉండనుంది. టెక్నో Camon 20 ప్రీమియర్ 5G దేశంలో జూలై 7న లాంచ్ కానుందని (Tecno India) ట్వీట్‌లో ప్రకటించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Dimensity SoC, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Amazon Prime Day Sale : జూలై 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్.. టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

టెక్నా Camon 20 ప్రీమియర్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
6.67-అంగుళాల ఫుల్-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) AMOLEDని కలిగి ఉంది. Tecno Camon 20 ప్రీమియర్ 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 8GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8050 SoC ద్వారా అందిస్తుంది. ఈ ఫోన్ Android 13-ఆధారిత HiOS 13.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. టెక్నో Camon 20 ప్రీమియర్ 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP RGBW ప్రైమరీ కెమెరాతో సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 108MP సెన్సార్ ఉన్నాయి.

Tecno Camon 20 Premier 5G India Launch Date Set For July 7

Tecno Camon 20 Premier 5G India Launch Date Set For July 7

ఆక్టా ఫ్లాష్ లేదా రింగ్-ఫ్లాష్ యూనిట్‌ను కూడా కలిగి ఉంది. సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్డ్ ఫ్రంట్ కెమెరా 32MP సెన్సార్‌తో వస్తుంది. టెక్నో Camon 20 ప్రీమియర్ 5G 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4G, 5G, OTG, NFC, GPS, బ్లూటూత్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.

Read Also : WhatsApp Beta Users : వాట్సాప్ యూజర్లు.. ఇకపై హై-క్వాలిటీ వీడియోలను కూడా పంపుకోవచ్చు..!