Moto Razr : మోటరోలా నుంచి మడతపెట్టే ఫోన్ ఇదిగో

  • Publish Date - November 14, 2019 / 07:49 AM IST

లెనొవో సబ్ బ్రాండ్ మోటరోలా నుంచి కొత్త మోడల్ ఫోన్ లాంచ్ యింది. అదే.. Moto Razr ఫోన్. ఈ సరికొత్త మోడల్ ఫోన్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ Moto Razr ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎన్నో రుమార్లు వచ్చాయి. ఫోల్డింగ్ ఫోన్..  ప్రీమియం డిజైన్ తో రెండు స్క్రీన్లు ఆకర్షణీయంగా ఉండనున్నాయి. 

ఇందులో ఒకటి మెయిన్ డిస్‌ప్లే.. రెండోది చిన్న స్ర్కీన్.. (డివైజ్ ఫోల్డ్ అయ్యాక). మోటా రజర్.. మినిమల్ బెజెల్స్ ఉండగా, ఫ్రంట్ సైడ్ వైడ్ నాచ్ ఒకటి ఉంటుంది. ఈ ఫోన్ ధర 1500 డాలర్లు కాగా (రూ.1,08,273)గా నిర్ణయించారు. గ్లోబల్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లలోకి తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. 

ఎంతో ఖరీదైన ఈ ఫోన్ లక్షకు పైగా ధర పలుకనుంది. ఇటీవల ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మాదిరిగా ఫోల్డబుల్ ఫోన్ అయి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటిక Moto Razr ఫోన్ లాంచింగ్ విషయమై రిజిస్ట్రేషన్ పేజీ క్రియేట్ చేసింది. కొన్నివారాలు లేదా నెలల్లో భారత మార్కెట్లోకి రానుంది. 

ఫీచర్లు – స్పెషిఫికషన్లు ఇవే :
* Moto Razr రెండు స్ర్కీన్లు 
* ఫ్లెక్సిబుల్ pOLED డిస్‌ప్లే
* 6.2 అంగుళాల సైజు 
* 21:9 సినిమావిజన్ అస్పెక్ట్ రేషియో
* 2.7-అంగుళాల gOLED డిస్‌ప్లే
* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (కిందివైపు)
* 16MP కెమెరా (సెల్ఫీలు- అన్ ఫోల్డెడ్)
* 16MP రియర్ కెమెరా (ఫోల్డెడ్) 
* 5MP కెమెరా (లోపల) అన్ ఫోల్డెడ్)
* స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
* 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరజీ
* 2510mAh బ్యాటరీ,  15W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ 
* ఆండ్రాయిడ్ 9 పై OS