Motorola Edge 50 Fusion : ఇది కదా డిస్కౌంట్.. అత్యంత చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర భారీగా తగ్గిందోచ్.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 12వేల లోపు ధరకే లభిస్తోంది.

Motorola Edge 50 Fusion : ఇది కదా డిస్కౌంట్.. అత్యంత చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

Motorola Edge 50 Fusion

Updated On : July 17, 2025 / 11:42 PM IST

Motorola Edge 50 Fusion : మోటోరోలా ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు (Motorola Edge 50 Fusion) స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, అనేక బ్రాండ్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

గత ఏడాదిలో వచ్చిన 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. లాంచ్ ధరతో పోలిస్తే భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ డిస్కౌంట్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొత్తం 2 కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 12GB RAM, 256GB స్టోరేజ్ కలిగి ఉంది. ప్రారంభంలో రూ. 22,999 ధరకు వచ్చిన 8GB వేరియంట్ ఇప్పుడు కేవలం రూ. 18,999కే లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌‌లో రూ.18,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.7వేల ధరకు లభిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12వేల ధరకు పొందవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వస్తోందోచ్.. మీరు ఊహించిన ధర కన్నా తక్కువే..!

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.67-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్మార్ట్ వాటర్ టచ్ ప్రొటెక్షన్, వాటర్, డస్ట్ నిరోధకతకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌తో 12GB వరకు ర్యామ్‌తో వస్తుంది.

మైక్రో SD కార్డ్ ద్వారా 256GB ఎక్స్‌పాండబుల్ ఇంటర్న్ స్టోరేజీని కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ 5000mAh బ్యాటరీతో 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Hello OSపై రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 13MP సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.