Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్‌కు ముందు.. అమెజాన్ ధర భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌తో డిస్కౌంట్ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అందిస్తోంది. కస్టమర్‌లు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.7,099 వరకు ఆదా చేసుకోవచ్చు.
గత ఏడాది ఏప్రిల్‌లో రూ.35,999 (12GB+256GB)కి లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్డ్ OLED ప్యానెల్, HDR10+ సపోర్ట్, ఏఐ పవర్డ్ ట్రిపుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ IP68 సర్టిఫికేషన్ ఉన్నాయి. మీరు కొత్త మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే.. మీరు కచ్చితంగా అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధర డీల్‌ని ఓసారి చెక్ చేయండి. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర :
ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 50ప్రో రూ.35,999 నుంచి రూ.30,400కు లిస్టు అయింది. వన్‌కార్డ్ HDFC కార్డ్ వంటి ఎంపిక చేసిన కార్డులతో కస్టమర్‌లు అదనంగా రూ.1,500 సేవ్ చేసుకోవచ్చు. తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కొనుగోలుదారులు వర్కింగ్ కండిషన్ మోడల్ ఆధారంగా రూ.22,800 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
కొనుగోలుదారులు నెలకు రూ.1,474 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. బేసిక్ ఈఎంఐ కోసం ఆప్షన్లు కూడా ఉన్నాయి. కస్టమర్లు అమెజాన్ నుంచి మొబైల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, అదనపు మొబైల్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. సెగ్మెంట్‌లో అత్యుత్తమమైన 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కంపెనీ HDR10 ప్లస్ సపోర్ట్‌తో పాటు 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 SoC కలిగి ఉంది.
12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోతో, కస్టమర్లు 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో సెన్సార్‌ను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ కస్టమర్లు 50MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు.