Motorola Edge 50 Pro : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధర తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే తక్కువకే వస్తుంది..!

Motorola Edge 50 Pro : మోటోరోలా కొత్త ఫోన్ కావాలా? అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 30న ఈ మోటోరోలా కొత్త ఫోన్ రానుంది.

Read Also : Post Office Special Scheme : పోస్టాఫీస్‌లో 5 ఏళ్లలో రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం వడ్డీనే రూ.4.5 లక్షలు సంపాదించొచ్చు!

అయితే, ఈ ఫోన్ లాంచ్‌కు ముందు.. కంపెనీ పాపులర్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై అమెజాన్‌లో భారీ ధర తగ్గింపును అందిస్తోంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూసేవారికి ఇదే సరైన సమయం. అమెజాన్ మోటోరోలా ఎడ్జ్50 ప్రోపై రూ.7వేల కన్నా తగ్గింపును అందిస్తోంది. సరసమైన ధరకే ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అమెజాన్ డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్) భారత మార్కెట్లో ధర రూ.35,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్‌లో ఈ మోడల్ రూ.27,999కు లిస్టు అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎడ్జ్ 50 ప్రోపై రూ.5,709 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1,750 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా చేయాలంటే పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయొచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద, ఎడ్జ్ 50ప్రో స్నాప్‌డ్రాగన్ 7జెన్ 3 SoC ద్వారా పవర్ పొందుతుంది.

12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత HelloUI స్కిన్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 125W వరకు వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

Read Also : Powerful Bikes : సూపర్ బైక్స్ అదుర్స్.. 5 పవర్‌ఫుల్ 650cc బైక్స్ ఇవే.. రోడ్డుపై రయ్ రయ్‌మని దూసుకెళ్లొచ్చు.. ధర, మైలేజీ ఎంతంటే?

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్‌లో OISతో 50MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.