Powerful Bikes : సూపర్ బైక్స్ అదుర్స్.. 5 పవర్‌ఫుల్ 650cc బైక్స్ ఇవే.. రోడ్డుపై రయ్ రయ్‌మని దూసుకెళ్లొచ్చు.. ధర, మైలేజీ ఎంతంటే?
Powerful Bikes : ఈ సూపర్ బైక్స్ చూశారా? పవర్‌ఫుల్ 650cc ఇంజిన్‌తో రోడ్డు ట్రిప్‌లకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఒకసారి బైక్ తీశారంటే రోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోవచ్చు..

Powerful Bikes
Powerful Bikes : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? టూవీలర్ మార్కెట్లో పవర్‌ఫుల్ సూపర్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. రోడ్లపై రయ్ రయ్ మని దూసుకుపోయే 650cc మోటార్ సైకిల్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ సెగ్మెంట్‌లో అనేక మోడల్స్ కూడా ఉన్నాయి.
లాంగ్ జర్నీకి ఈ సూపర్ బైకులు బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు రోడ్ ట్రిప్ కోసం సరైన బైక్ కోసం చూస్తుంటే మీకోసం 5 అద్భుతమైన మోడల్ బైకులు ఉన్నాయి. ఆకట్టుకునే ఫీచర్లతో 650cc బైకుల జాబితాను అందిస్తున్నాం. క్రూయిజర్లను ఇష్టపడినా లేదా స్పోర్టీ రైడ్‌లను ఇష్టపడినా మీకు నచ్చిన లాంగ్ రైడ్ కొత్త బైకులను ఓసారి పరిశీలిద్దాం.
Read Also : iPhone 15 Plus : భలే డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ ధర ఇంత తక్కువా? అసలు వదులుకోవద్దు..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 :
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 క్రూయిజర్ బైక్ 647.95cc ఆయిల్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 46.39hp, 52.3Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. క్లాసిక్ 650 సీటు ఎత్తు 800mm, 243కిలోల బరువు ఉంటుంది. 32కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ధరలు రూ. 3.37 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.
కవాసకి Z650 :
కొత్త బైక్ కవాసకి Z650 స్ట్రీట్‌ఫైటర్ 649cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ కలిగి ఉంది. 68hp, 64Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. Z650 790mm సీటు ఎత్తును కలిగి ఉంది. 188 కిలోల ఎత్తును కలిగి ఉంటుంది. ఈ కవాసకి 28.11 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది. ఈ బైకు ధర రూ. 6.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
హోండా CBR650R :
హోండా నుంచి CBR650 R రోడ్డు ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ బైక్ 649cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 93.87hp, 63Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆఫర్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. CBR650 R సీటు ఎత్తు 810mm, 209 కిలోల బరువు ఉంటుంది. మైలేజ్ 25 కిమీ/లీ అందిస్తుంది. భారత మార్కెట్లో రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది.
BSA గోల్డ్‌స్టార్ 650 :
రోడ్డు ప్రయాణాలకు సరైన మరో పవర్‌ఫుల్ 650cc క్రూయిజర్ బైక్ BSA గోల్డ్‌స్టార్ 650. ఈ బైక్ 652cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 45hp, 55Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గోల్డ్‌స్టార్ 650 సాడిల్ ఎత్తు 782mm, 201 కిలోల బరువు ఉంటుంది. మైలేజ్ 25 కిమీ/లీ. ధర రూ. 2.99 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభమవుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT650 :
మీరు స్పోర్ట్స్ బైక్, స్ట్రీట్‌ఫైటర్లు లేదా క్రూయిజర్ ఇష్టపడకపోతే.. స్టైలిష్ ఇంటర్‌సెప్టర్ GT 650 కేఫ్ రేసర్ కలిగి ఉంది. 648cc ఆయిల్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 46.80hp, 52.3Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ సీటు ఎత్తు 803mm, 214 కిలోల బరువు ఉంటుంది. మైలేజ్ 27 కి.మీ/లీ. కాంటినెంటల్ GT 650 ధరలు రూ. 3.19 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.