Post Office Special Scheme : పోస్టాఫీస్‌లో 5 ఏళ్లలో రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం వడ్డీనే రూ.4.5 లక్షలు సంపాదించొచ్చు!

Post Office Special Scheme : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ అనేది పోస్టాఫీసు అందించే పథకం.. ఇందులో 5 ఏళ్ల పాటు డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Post Office Special Scheme : పోస్టాఫీస్‌లో 5 ఏళ్లలో రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం వడ్డీనే రూ.4.5 లక్షలు సంపాదించొచ్చు!

Post Office Scheme

Updated On : April 28, 2025 / 4:47 PM IST

Post Office Special Scheme : బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీస్‌లో కూడా అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలలో ఒకటి.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (NSC). ఈ పథకం ప్రత్యేకంగా అధిక వడ్డీతో పాటు సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి డిపాజిట్ పథకం లాంటిది.

ఇందులో 5 ఏళ్లు డబ్బు జమ చేయడం ద్వారా భారీ వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం, పోస్ట్ ఆఫీస్ ఈ పథకంపై 7.7శాతం వడ్డీ పొందవచ్చు. NSC ప్రయోజనాలు పొందాలంటే.. రూ. 10 లక్షల డిపాజిట్ మొత్తంపై వడ్డీని ఎలా లెక్కించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : OnePlus 13s Launch : వారెవ్వా.. మతిపోగొట్టే ఫీచర్లతో వన్‌ప్లస్ 13s వస్తోంది.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

రూ. వెయ్యి నుంచి పెట్టుబడితో.. :
NSCలో పెట్టుబడిని కనీసం రూ. వెయ్యితో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. మీరు ఇందులో ఎంత మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఏ పౌరుడైనా ఇందులో ఖాతాను తెరవవచ్చు. జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది.

ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మైనర్ పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, 10 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి పేరు మీద NSC కొనుగోలు చేయవచ్చు. మీరు ఒకేసారి మల్టీ NSC అకౌంట్లలో కూడా ఓపెన్ చేయొచ్చు.

5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ ఎంతంటే? :
NSC మరో ప్రయోజనం ఏమిటంటే.. మీరు చాలా కాలం పాటు డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. ఈ పథకం కింద కేవలం 5 ఏళ్లలో మెచ్యూరిటీ చెందుతుంది. వడ్డీ వార్షిక ప్రాతిపదికన చక్రవడ్డీని పొందవచ్చు. రాబడి కూడా అందుబాటులో ఉంటుంది.

5 ఏళ్ల వడ్డీని పెట్టుబడి పెట్టే సమయంలో వర్తించే వడ్డీ రేటు ప్రకారం లెక్కిస్తారు. ఈలోగా వడ్డీ రేటు మారినప్పటికీ.. మీ ఖాతాను ప్రభావితం చేయదు. సెక్షన్ 80C కింద జమ చేసిన మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ప్రతి ఏడాదిలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు పొందవచ్చు.

కొద్ది మొత్తాన్ని విత్‌డ్రా చేయలేరు :
ఇతర పథకాల మాదిరిగానే పాక్షిక విత్‌డ్రా లేదు. మీరు 5 ఏళ్ల తర్వాత మాత్రమే మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే మొత్తాన్ని చేయవచ్చు. ఒకే అకౌంట్ లేదా ఉమ్మడి ఖాతాలో ఒకరు లేదా ఖాతాదారులు మరణించినప్పుడు గెజిటెడ్ అధికారి స్వాధీనం చేసుకోవచ్చు.

Read Also : iPhone 15 Plus : భలే డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ ధర ఇంత తక్కువా? అసలు వదులుకోవద్దు..!

రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందంటే? :
మీరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.7 వడ్డీ రేటు ప్రకారం.. మీకు వడ్డీగా 4,49,034 రూపాయలు మాత్రమే లభిస్తాయి. అంటే.. దాదాపు 4.5 లక్షలు. 5 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ. 14,49,034 లభిస్తాయి. మీరు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఏ పోస్టాఫీసులోనైనా పూర్తి వివరాలను తెలుసుకుని మీ బడ్జెట్ తగినట్టుగా ఎంచుకోవచ్చు.