OnePlus 13s Launch : వారెవ్వా.. మతిపోగొట్టే ఫీచర్లతో వన్‌ప్లస్ 13s వస్తోంది.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus 13s Launch : వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 13s ఫోన్ లాంచ్ కానుంది. ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పుడు చూద్దాం..

OnePlus 13s Launch : వారెవ్వా.. మతిపోగొట్టే ఫీచర్లతో వన్‌ప్లస్ 13s వస్తోంది.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus 13s India launch soon

Updated On : April 28, 2025 / 3:30 PM IST

OnePlus 13s Launch : వన్‌ప్లస్ యూజర్ల కోసం సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ 13s త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ కాంపాక్ట్ పవర్‌హౌస్ అవుతుందని పేర్కొంటూ కంపెనీ ఫస్ట్ లుక్‌ టీజర్‌ను షేర్ చేసింది.

Read Also : iOS 19 Release : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ ఐఫోన్లలో iOS 19 అప్‌డేట్ వస్తోందోచ్.. ఏఐ ఫీచర్లు, మరెన్నో అప్‌గ్రేడ్స్..!

ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఐకానిక్ అలర్ట్ స్లైడర్ స్థానంలో కస్టమైజడ్ బటన్‌ లైనప్‌లో రానుంది. ఈ టీజర్ ప్రకారం.. వన్‌ప్లస్ కొనుగోలుదారులకు బ్లాక్, రోజ్ కలర్ వేరియంట్‌లతో సహా రెండు కలర్ ఆప్షన్లు లభిస్తాయని సూచిస్తుంది. ఈ వన్‌ప్లస్ పర్ఫార్మెన్స్, డిజైన్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ 13s డిజైన్ :
గత వారమే చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 13T రీబ్రాండెడ్ వెర్షన్ వన్‌ప్లస్ 13s అని టీజర్ సూచిస్తుంది. పోస్ట్‌ ప్రకారం.. ఈ ఫోన్ వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్లాష్‌తో భారీ కెమెరా బంప్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఈ ఫోన్ 6.32-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. నివేదికలను విశ్వసిస్తే.. రాబోయే ఈ వన్‌ప్లస్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 16GB ర్యామ్ వరకు, 1TB వరకు స్టోరేజీని అందించవచ్చు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ కావచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,260mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP కెమెరాతో పాటు 50MP టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండవచ్చు.

Read Also : Odysse Evoqis Lite : కొత్త చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ భలే ఉందిగా.. సింగిల్ ఛార్జ్‌‌తో 90కి.మీ దూసుకెళ్లగలదు.. ధర కూడా తక్కువే..!

వన్‌ప్లస్ 13s ధర (అంచనా) :
వన్‌ప్లస్ 13T ధర CNY 3,399 అంటే.. దాదాపు రూ. 39,800. వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లతో లాంచ్ అయితే.. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర దాదాపు రూ. 45వేలు కావచ్చు. అయితే, ధర, స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. వన్‌ప్లస్ 13s లాంచ్ తేదీ ఇంకా తెలియదు.