Odysse Evoqis Lite : కొత్త చీపెస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ భలే ఉందిగా.. సింగిల్ ఛార్జ్‌తో 90కి.మీ దూసుకెళ్లగలదు.. ధర కూడా తక్కువే..!
Odysse Evoqis Lite : అద్భుతమైన ఫీచర్లతో ఒడిస్సే ఎవోకిస్ లైట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. 90కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. పూర్తి వివరాల కోసం ఓసారి చదివేయండి.

Odysse Evoqis Lite
Odysse Evoqis Lite : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వచ్చేసింది. దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఒడిస్సే ఎవోకిస్ లైట్ అనే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను తక్కువ ధరకే ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది.
తక్కువ ధరకే స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ :
అడ్వెంచర్ రైడింగ్ ఇష్టపడే వారి కోసం కంపెనీ సరసమైన స్పోర్ట్స్ బైక్‌ను అందిస్తోంది. థ్రిల్‌ను ఇష్టపడే వారికి ఈ స్పోర్ట్స్ బైక్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో రిలీజ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ను రూ.1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందిస్తోంది. ఒడిస్సే ఎవోకిస్ లైట్ ఎలక్ట్రిక్ బైక్‌ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు.
ఒడిస్సే ఎవోకిస్ లైట్ ఫీచర్లు :
ఈ బైక్ స్పెసిఫికేషన్లపై కంపెనీ అనేక వివరాలను రివీల్ చేసింది. ఈ బైక్ 60V బ్యాటరీతో వస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.
ఈ బైక్ ఎక్కువ దూరప్రయాణాలకు సరైనదిగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు నెమిన్ వోరా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ ద్వారా స్పోర్టీ రైడ్‌లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. ఈ బైక్ పర్ఫార్మెన్స్, వినియోగదారుల బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి థ్రిల్ కోరుకునే వారి కోసమే ఈ బైక్ రూపొందించామన్నారు.
ఒడిస్సే ఎవోకిస్ లైట్ స్పెషల్ ఫీచర్లు :
- కీలెస్ ఇగ్నిషన్
- మల్టీ డ్రైవింగ్ మోడ్స్
- మోటార్ కట్-ఆఫ్ స్విచ్
- యాంటీ థెఫ్ట్ లాక్
- బ్యాటరీ బ్యాకప్
- 5 కలర్ ఆప్షన్లు (కోబాల్ట్ బ్లూ, ఫైర్ రెడ్, లైమ్ గ్రీన్, మాగ్నా వైట్, బ్లాక్)
ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండు లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా విక్రయిస్తుంది. ఒడిస్సే E2Go, ఒడిస్సే V2 బైకులు. ఇందులో మొదటిది E2Go లైట్, E2go+, E2GO గ్రాఫేన్ అనే 3 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. రెండోది V2 లైట్, V2 గ్రాఫేన్, V2+ అనే 3 ట్రిమ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రాండ్ సింగిల్ B2B సెగ్మెంట్ ఇ-స్కూటర్, TROT 2.0 IoTతో పాటు 250 కిలోల లగేజ్ లోడింగ్ సామర్థ్యం కలిగి ఉంది.