Motorola Razr 50 UltraMotorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra : మోటోరోలా ఫ్యాన్స్ కోసం మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఫోల్డబుల్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.
మోటోరోలా ఫ్లిప్ ఫోన్లలో కంపెనీ లేటెస్ట్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ మోటోరోలా రేజర్ 60 అల్ట్రాను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోటోరోలా మడతబెట్టే ఫోన్ లాంచ్ అయిన వెంటనే రేజర్ 50 అల్ట్రా ధర కూడా భారీగా తగ్గింది.
మోటోరోలా యూజర్లు డిస్కౌంట్‌తో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-స్క్రీన్ సెటప్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఆకట్టుకునే డిజైన్లు, అత్యుత్తమ కెమెరా సిస్టమ్ ఉన్నాయి.
గతంలో చాలా మందికి ఈ ఫోన్ ధర అందుబాటులో ఉండేది కాదు. ఇటీవలి ధర తగ్గింపుతో కొనుగోలుదారులు మరింత సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చు.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా డిస్కౌంట్ :
ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా రేజర్ 50 అల్ట్రా రూ.1,19,000 ధరకు జాబితా అయింది. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా లాంచ్‌తో రేజర్ 50 అల్ట్రా ధర ఒక్కసారిగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన ఆఫర్ కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఎందుకంటే.. కంపెనీ ఇప్పుడు ఫోన్‌పై 42 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు మోటోరోలా రేజర్ 50 అల్ట్రాను కేవలం రూ.68,549కి పొందవచ్చు.
అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌కు ప్రస్తుతం ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేనప్పటికీ, మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా సిలికాన్ పాలిమర్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంది. IPX8 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ లోపలి వైపు అద్భుతమైన 6.9-అంగుళాల డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
బయటి వైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ 4-అంగుళాల డిస్‌ప్లే ఉంది. బాక్స్ వెలుపల మోటోరోలా ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది.
Read Also : Vivo T3 Ultra : భలే ఉంది భయ్యా.. అతి తక్కువ ధరలో వివో T3 అల్ట్రా ఫోన్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!
ఫోటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే.. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా 50+50MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.