Motorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో మోటోరోలా రెజర్ 60 అల్ట్రా లాంచ్ తర్వాత మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ ధర తగ్గింది. ఈ స్టైలిష్ క్లామ్‌షెల్ ఫ్లిప్ ఫోన్ రూ.99,999 ధర ఉండగా ఇప్పుడు రూ.65,100 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ ఫోల్డబుల్ డిజైన్, అన్ని యాప్‌లకు సపోర్టు ఇచ్చే మల్టీఫేస్ కవర్ డిస్‌ప్లే కలిగి ఉంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంది.
తక్కువ ధరకు ప్రీమియం ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ మోటోరోలా రెజర్ 50 అల్ట్రాకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ధర :
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా లాంచ్ ధర రూ.31,450 తగ్గింది. కొనుగోలుదారులు రూ.3,423 యాక్సస్ క్రెడిట్ బ్యాంక్ ద్వారా డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో రూ.65,026 లోపు అందుబాటులో ఉంటుంది. రూ.2,410 నుంచి ఈఎంఐ ద్వారా కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా HDR10+, మోటోరోలా 10-బిట్ కలర్, 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 4-అంగుళాల LTPO అమోల్డ్ కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది.
గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. మోటోరోలా రెజర్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల లోపలి డిస్‌ప్లేగా ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.
Read Also : iQOO Neo 10 Price : ఐక్యూ నియో 10 వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు ఇవేనా?
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4000mAh బ్యాటరీని అందిస్తుంది.