Motorola Razr 50 Ultra
Motorola Razr 50 Ultra : మోటోరోలా అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. తక్కువ బడ్జెట్‌లో ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. లాస్ట్ జనరేషన్ (Motorola Razr 50 Ultra) మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
వాస్తవానికి, ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 99,999 ధరకు లాంచ్ అయింది. డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, డ్యూయల్ కెమెరాలు, భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ మడతబెట్టే ఫోన్ రూ. 37వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో బ్యాంక్ డిస్కౌంట్లతో మరెన్నో తగ్గింపులు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ధర ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఫ్లిప్‌కార్ట్‌లో రేజర్ 50 అల్ట్రా ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ధర భారీగా తగ్గింది. రూ.34వేలు డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.65,990కి లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలుపై 5 శాతం తగ్గింపు పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి రూ.62,900కి తగ్గుతుంది.
బ్యాంక్ కార్డులతో ఈఎంఐ లేదా ఫ్రీ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. అదనంగా, ధరను మరింత తగ్గాలంటే మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా స్పెషిఫికేషన్లు (Motorola Razr 50 Ultra) :
గత ఏడాదిలో మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ 6.9-అంగుళాల ఫుల్-HD+ LTPO pOLED మెయిన్ స్క్రీన్‌తో 165Hz రిఫ్రెష్ రేట్, 4-అంగుళాల ఔటర్ LTPO pOLED ప్యానెల్‌తో వచ్చింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
ఈ మడతబెట్టే ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ మోటోరోలా ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.