Motorola Razr 60 Ultra
Motorola Razr 60 Ultra : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా లేటెస్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. మోటోరోలా రేజర్ 60 అల్ట్రా అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ మడతబెట్టే ఫోన్ లాంచ్ ధర రూ. 99,999కు ఉండగా ఇప్పుడు కేవలం రూ. 80వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ టైటానియం-రీన్ఫోర్స్డ్ హింజ్‌తో (Motorola Razr 60 Ultra) వస్తుంది. అంతేకాదు.. 8లక్షల కన్నా ఎక్కువ ఫోల్డ్‌లను తట్టుకోగలదు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, మోటో ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఫ్లిప్ ఫోన్‌లను ఇష్టపడతే ఈ మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్ కొనేసుకోవచ్చు. ఇంతకీ మోటోరోలా రెజర్ అల్ట్రా 5జీ ఫోన్ తగ్గింపు ధకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్‌లో మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 5జీ డీల్ :
ప్రస్తుతం మోటోరోలా రేజర్ 60 అల్ట్రా 5జీ ఫోన్ కేవలం రూ.79,999 ధరకే లభిస్తుంది. లాంచ్ ధర కన్నా రూ.20వేలు తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు. కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2,399 వరకు (5శాతం) క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి రూ.33,900 వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. అమెజాన్ రూ.3,879 నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా ఫోన్ 6.96-అంగుళాల ఎల్టీపీఓ pOLED మెయిన్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ సిరామిక్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. డాల్బీ విజన్‌తో అప్‌గ్రేడ్ అయింది. ఔట్ సైడ్ 4-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అదే 165Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. ఈ మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC కలిగి ఉంది. గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.
మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్ 68W వైర్డు, 30W వైర్‌లెస్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. 3 ఏళ్ల OS ఆపరేటింగ్ సిస్టమ్ 4 ఏళ్ల అప్‌డేట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత హాలో యూఐపై రన్ అవుతుంది. IP48 రేటింగ్ కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. డ్యూయల్ 50MP సెన్సార్లు (ప్రైమరీ, అల్ట్రావైడ్), OISతో కూడిన 50MP ఫ్రంట్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, 30x AI సూపర్ జూమ్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది.