Motorola Latest Phones Sale : పండుగ సేల్ డీల్స్.. మోటోరోలా లేటెస్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Motorola Latest Phones Sale : మోటోరోలా లేటెస్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లను ముందుగానే ప్రకటించింది. ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published On : September 22, 2025 / 03:13 PM IST
Motorola Latest Phones Sale : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోటోరోలా లేటెస్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఈ ఏడాదిలో లాంచ్ చేసిన అన్ని లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై పండుగ డీల్స్‌ను వెల్లడించింది.
రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా పాపులర్ మోటోరోలా ఫోన్ ఎడ్జ్, G సిరీస్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్ వరకు వైడ్ రేంజ్ మోటోరోలా ఫోన్‌లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.పండుగ సేల్ సమయంలో మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లతో ప్రతి ఫోన్ కొనుగోలుపై రూ. 10వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో తగ్గింపుతో ధర రూ.24,999కు లభిస్తుంది. లాంచ్ ధర రూ.29,999 నుంచి రూ.5వేలు తగ్గింపు పొందింది. ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్-లెవల్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి.
మోటోరోలా G96 5G : మోటరోలా G96 5G, మోటో G86 పవర్ రెండూ ధర తగ్గింపు పొందాయి. మోటోరోలా G96 5G ప్రారంభ ధర రూ.17,999కి లాంచ్ కాగా తగ్గింపుతో ధర రూ.14,999కి అందుబాటులో ఉంటుంది. డిస్కౌంట్ ధర రూ. 3వేలు తగ్గింపు పొందింది.
మోటోరోలా G86 పవర్ : మోటోరోలా G86 పవర్ ధర కూడా భారీగా తగ్గింది. అసలు ధర రూ.17,999కి లాంచ్ కాగా తగ్గింపుతో రూ.15,999కి లభ్యమవుతుంది. అంటే రూ. 2వేలు తగ్గింపు పొందింది. ఈ రెండు ఫోన్‌లు pOLED డిస్‌ప్లేలు, పవర్‌ఫుల్ బ్యాటరీలతో వస్తాయి.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ : మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22,999 ఉండగా రూ.19,999కి తగ్గింది.. అంటే ఏకంగా రూ.3వేలు తగ్గింపు పొందింది. ఈ మోటోరోలా ఫ్యూజన్ ఫోన్ 1.5K అమోల్డ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.
మోటోరోలా రేజర్ 60 : మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 60 కూడా భారీగా తగ్గింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ రూ.49,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పుడే పండగ సేల్ సందర్భంగా రూ.10వేలు తగ్గింపుతో రూ.39,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లెక్సిబుల్ ఫోల్డబుల్ స్క్రీన్, భారీ సెకండరీ డిస్‌ప్లే కలిగి ఉంది.
