MG Majestor SUV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఎంజీ మెజెస్టర్ SUV వచ్చేసిందోచ్.. లగ్జరీ ఫీచర్లు అదుర్స్, ధర, బుకింగ్ వివరాలివే!
MG Majestor SUV : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త ప్రీమియం SUV, ఎంజీ మెజెస్టర్‌ను ఫిబ్రవరి 12న భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఫీచర్లు, ధర బుకింగ్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
MG Majestor SUV
- ఎంజీ మెజెస్టర్ SUV కొత్త మోడల్ లాంచ్
- ఫిబ్రవరి 12న భారత మార్కెట్లో కొత్త ప్రీమియం కారు
- కిలోమీటర్ వారంటీ, 5 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 5 లేబర్-ఫ్రీ సర్వీసులు
- ఫీచర్లు, ధర బుకింగ్ వివరాలపై లుక్కేయండి
MG Majestor SUV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ఎంజీ కస్టమర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ వచ్చేసింది. దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త, ప్రీమియం ఎస్యూవీ, ఎంజీ మెజెస్టర్ ఫిబ్రవరి 12న భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
ఈ కొత్త ఎస్యూవీ డీ-ప్లస్ సెగ్మెంట్ ఎస్‌యూవీతో కంపెనీ ప్రస్తుత ఎంజీ గ్లోస్టర్ కన్నా బెటర్ ఫీచర్లతో వస్తుంది. కొత్త ఎంజీ మెజెస్టర్ SUV భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ వంటి వాహనాలతో నేరుగా పోటీపడుతుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ ధర, బుకింగ్‌లు :
కొత్త ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ ధరకు సంబంధించి కంపెనీ ఇంకా ధరను ప్రకటించలేదు. ఏప్రిల్ 2026లో ఈ కారు ధరలు ప్రకటించనుంది. కానీ, ఈ ఎస్యూవీ ధర దాదాపు రూ. 40 నుంచి రూ. 45 లక్షలు ఉంటుందని అంచనా.
ఎంజీ మెజెస్టర్ కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు కేవలం రూ. 41వేలు టోకెన్ మొత్తానికి బుక్ చేసుకోవచ్చు. అధీకృత డీలర్‌షిప్‌లు లేదా ఆన్లైన్ ఛానెల్స్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. మే 2026లో ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయి.
ఎంజీ మెజెస్టర్ SUVపై ఆఫర్లు :
ఎంజీ మెజెస్టర్ SUV లాంచ్ సందర్భంగా కంపెనీ ఈ SUVపై అనేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రారంభ కస్టమర్లకే వర్తిస్తాయి. మొదటి 3వేల మంది కస్టమర్లకు కంపెనీ 5-5-5 పీస్ ఆఫ్ మైండ్ ప్యాకేజీని అందిస్తోంది.
Read Also : IT PAN Rules : పాన్ కార్డు కొత్త రూల్స్.. రూ. 5 లక్షల లోపు కారు కొంటే ఇక ‘PAN’ అక్కర్లేదు.. ఎందుకంటే?
ఇందులో 5 ఏళ్ల అన్ లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ, 5 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 5 లేబర్-ఫ్రీ సర్వీసులు ఉన్నాయి. అదనంగా, మొదటి వెయ్యి మంది కస్టమర్లకు ఐసీఐసీఐ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ కోసం స్పెషల్ ఇన్విటేషన్ అందుతుంది.

MG Majestor SUV
ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లకు మెయిన్ డెలివరీ, స్పెషల్ ప్రివ్యూ కూడా లభిస్తుంది. ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ 3 వేరియంట్ల (షార్ప్ 4×2, సావీ (Savvy) 4×2, సావీ 4×4)లో అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే కొత్త SUV మొత్తం 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఎంజీ మెజెస్టర్ SUV ఫీచర్లు :
ఎంజీ మెజెస్టర్ క్యాబిన్ ప్రీమియం, లగ్జరీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ కారు డ్యూయల్-టోన్ థీమ్‌తో ప్రీమియం లెథరెట్ అప్హోల్స్టరీని అందిస్తుంది. ఎస్‌యూవీలో హై-ఎండ్ లుక్ అందిస్తుంది. డాష్‌బోర్డ్‌లో 2 భారీ 12.3-అంగుళాల స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మరొకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం అందిస్తుంది.
ఎంజీ మెజెస్టర్ వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, మసాజ్ ఫంక్షన్‌తో సీట్లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ జేబీఎల్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ మెజెస్టర్ సేఫ్టీ పరంగా కూడా చాలా బెటర్. లెవల్ 2 అడాస్, డ్రైవింగ్ సేఫ్టీని అందిస్తుంది.
ఎంజీ మెజెస్టర్ ఇంజిన్ :
ఎంజీ మెజెస్టర్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఎంజీ మెజెస్టర్ SUV మోడల్ 2.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. సుమారుగా 215bhp, 478Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అడ్వెంచర్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ చేసేవారికి ఎంజీ మెజెస్టర్ 4×4 డీజిల్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తుంది.
