Mukesh Ambani : రూ.726 కోట్ల డీల్.. లగ్జరీ మాండరిన్ ఓరియంటల్‌ను కొన్న ముఖేశ్ అంబానీ

తాజా డీల్ తో.. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఈ సంస్థకు మెజారిటీ ఓనర్ గా అవతరించనుంది.

Mukesh Ambani : రూ.726 కోట్ల డీల్.. లగ్జరీ మాండరిన్ ఓరియంటల్‌ను కొన్న ముఖేశ్ అంబానీ

Mukhesh Ambani

Updated On : January 10, 2022 / 2:14 PM IST

Mukesh Ambani : భారతీయ సంపన్న దిగ్గజం ముఖేశ్ అంబానీ మరో బిగ్ డీల్ చేశారు. న్యూయార్క్ లోని అత్యంత విలాసవంతమైన లగ్జరీ హోటల్ మాండరిన్ ఓరియంటల్ ను కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలోనే లీడింగ్ లగ్జరీ హోటల్ గ్రూప్స్ లో ఒకటి. ఈ డీల్ విలువ 98 మిలియన్ అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.726కోట్ల పైమాటే.

యాపిల్ కంపెనీ ఐకానిక్ హోటల్ గా న్యూయార్క్ స్టేట్ మన్‌హటన్ లోని మాండరిన్ ఓరియంటల్ కు పేరుంది. తాజా డీల్ తో.. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఈ సంస్థకు మెజారిటీ ఓనర్ గా అవతరించనుంది. ప్రస్తుతం 98.1 మిలియన్ డాలర్లతో కంపెనీలోని 73.4శాతం ప్రాపర్టీని RIL ఓన్ చేసుకుంది. అతి త్వరలోనే 100శాతం హక్కులను దక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

Read More : Kashi Vishwanath Dham : కాశీ విశ్వనాథ్ మందిర్ సిబ్బందికి చెప్పులు పంపించిన మోదీ

హాస్పిటాలిటీ రంగంలో ఇప్పటికే ముఖేశ్ అంబానీ సంస్థలు RIL, రియలన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ – RIIHL సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. షేర్ హోల్డర్స్ గా ఉన్నాయి. RILకు ఇండియాలోనే లగ్జరీ హోటల్ గా పేరున్న ఒబెరాయ్ హోటల్స్ ఫ్లాగ్ షిప్ కంపెనీ EIH ltdలో 19శాతం వాటా ఉంది. ముఖేశ్ భార్య నీతా అంబానీ EIH ltd కి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. యూకేలోని స్టోక్ పార్క్ లిమిటెడ్ లోనూ రిలయన్స్ కుపెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బార్లా కుంద్రా కాంప్లెక్స్ లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, పలు లగ్జరీ ఇండ్లు ఈ సంస్థకు ఉన్నాయి. ప్రస్తుతం.. న్యూయార్క్, లండన్ డెస్టినేషన్లుగా భారతీయ హోటల్ కంపెనీలు తమ పెట్టుబడులను విస్తరిస్తున్నాయి.

2003లో మన్‌హటన్ లో ఐకనిక్ లగ్జరీ హోటల్‌గా మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ ను స్థాపించారు. 80 కొలంబస్ సర్కిల్ ఏరియాలో… సెంట్రల్ పార్క్, కొలంబర్ సర్కిల్ కు ఆనుకుని ఈ హోటల్ నిర్మించారు. 2018లో 115 మిలియన్ డాలర్ల రెవెన్యూ తెచ్చిన ఈ హోటల్.. ఏటికేడు ఓనర్ల సంపాదన పెచుతోంది.

Read More : NASA : ప్రపంచ ఎకానమీల కంటే విలువైన గ్రహశకలం.. భూమ్మీదకు తెస్తే అందరూ బిలియనీర్లే!