India’s Costliest Apartment: ఇండియాలో అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం..

ముంబైలో వర్లీ ప్రాంతం పరిధిలో డాక్టర్ అన్నీ బిసెంట్ రోడ్డు ఉంది. ముంబై నగరంలో 2.84 కిలో మీటర్ల పొడవున ఈ రోడ్డు విస్తరించి ఉంటుంది. ఈ రోడ్డులోని లగ్జరీ ప్రాజెక్ట్ అయిన త్రీ సిక్ట్సీ‌వెస్ట్‌లో పెంట్‌హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బికె గోయెంకా ట్రిప్లెక్స్ రూ. 240కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. భారతదేశం రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్‌గా రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.

Costliest Apartment

India’s Costliest Apartment: ఇండియాలో ముంబై, ఢిల్లీ వంటి పెద్దపెద్ద నగరాల్లో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వందల కోట్లు వెచ్చించి పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు లగ్జరీ అపార్ట్‌మెంట్‌లలో ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా, ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌గా వర్లీ లగ్జరీ టవర్‌లోని పెంట్‌హౌస్ పేరుగడించింది. వర్లీ ప్రాంతంలోని డాక్టర్ అన్నీ బిసెంట్ రోడ్డు ఉంది. ముంబై నగరంలో 2.84 కిలో మీటర్ల పొడవున అన్నీ బిసెంట్ రోడ్డు విస్తరించి ఉంటుంది. ఈ రోడ్డులోని లగ్జరీ ప్రాజెక్ట్ అయిన త్రీ సిక్ట్సీ వెస్ట్‌లో ఈ పెంట్‌హౌస్ ఉంది. దీనిని వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బికె గోయెంకా ట్రిప్లెక్స్ రూ. 240కోట్లకు దక్కించుకున్నట్లు తెలిసింది. దీని ధరను బట్టిచూస్తే.. భారతదేశం రియల్ ఎస్టేట్ రంగంలో జరిగిన అతిపెద్ద డీల్‌గా రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.

Apartment: ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ ఇదే! ధర ఎంతో తెలుసా?

మార్కెట్ వర్గాల ప్రకారం.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే అపార్ట్ మెంట్‌లోని టవర్ బీలో 63వ, 64, 65వ అంతస్తుల్లో ఈ పెంట్‌హస్ ఉంది. ఇది 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రభుత్వ మురికివాడల పునరావాస పథకం కింద ఒక మురికివాడ కుటుంబానికి ఉచితంగా ఇచ్చే 300 ఎస్ఎఫ్టీకి వంద రెట్లు ఎక్కువ. ఈ పెంట్ హౌస్ కొనుగోలు ప్రక్రియ బుధవారం ముగిసినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. భారతదేశంలో ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్‌లలో ఇదేనట. ఇదిలాఉంటే అదే టవర్ లో పక్కనే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను బిల్డర్ వికాస్ ఒబెరాయ్ రూ. 240 కోట్లకు కొనుగోలు చేశారు. వ్యాపారవేత్త, బిల్డర్ అయిన సుధాకర్ శెట్టి భాగస్వామ్యంతో ఒబెరాయ్ స్వయంగా ఈ లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

 

దేశంలో గతంలో అత్యధిక ధర పలికిన అపార్ట్‌మెంట్ల వివరాలను చూస్తే.. 2015లో జిందాల్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీని నడుపుతున్న జిందాల్ కుటుంబం లోధా ఆల్టామౌంట్‌లో పదివేల చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 160 కోట్లకు కొనుగోలు చేసింది. అదేవిధంగా.. 2022లో నటుడు రణవీర్ సింగ్ – దీపికా పదుకొణెలు వారి వివాహం తరువాత ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లోని సాగర్ సంగమ్ బిల్డింగ్‌లో రూ. 119 కోట్లతో ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అదేవిధంగా  2022 డిసెంబర్‌లో దేవవ్రత్ డెవలపర్స్ రూ. 113 కోట్లతో ముంబైలోని ప్రభాదేవిలో నిర్మాణం జరుగుతున్న ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసింది.