అమెరికా గోల్డ్ రిజర్వులు ఉండే ఫోట్ నాక్స్‌లో ఉండాల్సిన 4,580 టన్నుల బంగారం ఇప్పుడు ఉందా? మాయవుతోందా? అన్న ప్రశ్నలు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌కు ఎదురవుతున్నాయి. దీనిపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) శాఖ చీఫ్‌గా ఎలాన్ మస్క్ ఉన్న విషయం తెలిసిందే.
మైక్ లీ అనే యూఎస్ సెనేటర్ ఫోట్ నాక్స్‌లో ఉండ్సాల్సిన బంగారంపై తాజాగా ట్వీట్ చేశారు. “ఒక యూఎస్ సెనేటర్‌గా నేను ఫోట్ నాక్స్‌లోకి వెళ్లడానికి చాలా సార్లు ప్రయత్నించాను. నన్ను అందులోకి అనుమతించడం లేదు. నేను ఎందుకని అడిగాను. ఇది మిలటరీ శిబిరమని అన్నారు. నేను సెనేటర్‌నని, మిలటరీ బేస్‌లకి ఎప్పుడైనా వెళ్లవచ్చని చెప్పాను. అయినప్పటికీ నేను రావద్దని అంటున్నారు” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. “ఫోట్ నాక్స్‌లో ఉంది.. లేదు.. అంటూ నిర్ధారించేవారు ఎవరు? అందులో బంగారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ఆ బంగారం అమెరికా ప్రజలది. అది ఇప్పటికీ ఫోట్ నాక్స్‌లో ఉందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం” అని చెప్పారు.
కాగా, అక్కడికి వెళ్లి బంగారం నిల్వలను చెక్ చేయాలని ఇప్పటికే అమెరికా డోజ్ ఇప్పటికే నిర్ణయించింది. కెంటకీలో ఫోర్ట్ నాక్స్ అమెరికా ఆర్మీ పరిధిలో ఉంటుంది.
Also Read: వారెవ్వా.. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి శతకం.. కివీస్ ఓపెనర్ విల్‌యంగ్ అద్భుతం..
చర్చ ఎలా మొదలైంది?
ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికా గోల్డ్ రిజర్వులు ఉండే ఫోట్ నాక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. మస్క్ అక్కడ నిల్వ ఉన్న బంగారం నిజంగా ఇంకా ఉన్నదా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఫోట్ నాక్స్ నిర్వహణలోని పారదర్శకతపై కొత్తగా చర్చ మొదలైంది. కొందరు ఫోట్ నాక్స్ లైవ్ వీడియో టూర్‌ను చేయాలని సూచిస్తున్నారు.
ఫోట్ నాక్స్ పై ఎన్నో అనుమానాలకు తావు ఇస్తోంది. అలాగే, దీనిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రతి నెల దేశ బంగారపు నిల్వలపై నివేదికలు విడుదల చేసినప్పటికీ, ప్రజలకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వాటిని చూపకపోవడం, భద్రతా పరంగా గట్టి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి.
అమెరికా సెనేటర్ మైక్ లీ కూడా ఫోర్ట్ నాక్స్‌ను సందర్శించేందుకు అనుమతి కోరినా, అది మిలిటరీ స్థావరం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండదని చెప్పడంతో మరింత అనుమానం పెరిగింది. దీంతో ప్రజల్లో బంగారం నిజంగా ఇంకా అక్కడ ఉందా లేదా అనే సందేహాన్ని పెంచుతోంది.
ఫోట్ నాక్స్ అమెరికా చరిత్రలో కీలక భూమిక పోషించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా యొక్క కీలకమైన పత్రాలను, అందులో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, యూఎస్ కాన్స్టిట్యూషన్ లాంటి దస్త్రాలను రక్షించేందుకు దీనిని ఉపయోగించారు. ప్రస్తుతం ఫోట్ నాక్స్‌లో 147 మిలియన్ ట్రోయ్ ఔన్సుల కంటే ఎక్కువ బంగారం ఉందని అంచనా. ఇది అమెరికాలోనే అతిపెద్ద బంగారం నిల్వగానే గుర్తింపు పొందింది.
మస్క్ అధికారికంగా ఆడిట్ చేయాలని నేరుగా కోరకపోయినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు పారదర్శకతపై మరింత చర్చకు దారి తీశాయి. “ఇంత బంగారం చూడటం ప్రజలకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. చివరికి అది ప్రజలదే కదా?” అని మస్క్ వ్యాఖ్యానించారు.